మనలో ఆత్మ విశ్వాసం ఉంటే మన స్థాయి ఏదైనా..ఉండే చోటు ఏదైనా.. ఎన్ని కష్టాలొచిన్నా.. అనుకున్నది సాధించి తీర తామని పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. ఈ మాటలను నిజం చేస్తూ.. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వారిలో సురేంద్రన్ కె.పటేల్ (Surendran K Patel) కూడా ఒకరు.
కేరళలోని కాసర్గోడ్ లో ఒక మామూలు నిరుపేద కుటుంబంలో జన్మించారు సురేంద్రన్ కె.పటేల్.ఇంట్లో నలుగురూ పనిచేస్తే తప్ప కడుపు నిండని కుటుంబం తనది కావడంతో తన అక్కతో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు.అలా ఒక వైపు చిన్నా చితకా కూలి పనులు చేసుకుంటూనే మరో వైపు పదో తరగతి వరకు తన చదివును నెట్టుకొచ్చారు.కానీ ఆ తర్వాత ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో తన చదువు అక్కడితో ఆపేసి పూర్తిగా బీడీలు చూట్టే పనికి వెళ్లడం మొదలు పెట్టారు.
అయితే ఆ పని వల్ల డబ్బులు వచ్చి పూట గడుస్తునప్పటికీ తన చదువును కొనసాగించలేకపోతున్నాననే బాధ సురేంద్రన్ ను లోపలి నుంచి తొలి చేయడం మొదలు పెట్టింది. తాను ఎలాగైనా చదువుకొని జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్న సురేంద్రన్ ఓ ప్రభుత్వ కళాశాలలో చేరి ఒక వైపు కూలీ పనులు చేసుకుంటూనే చదువును కొనసాగించారు.
కానీ ఇటు పనులకు వెళ్తూ అటు అప్పుడప్పుడు కళాశాలకు వెళ్లి చదువుకున్న సురేంద్రన్ కి అటెండెన్స్ తగ్గింది.దీంతో యాజమాన్యం తనను పరీక్షలు రాయటానికి అనుమతించలేదు.
ఇన్ని రోజులు పడిన కష్టం నీరు కారి పోతుందేమో అని భయపడిన సురేంద్రన్ తన పరిస్థితిని యాజమాన్యానికి చెప్పుకొని ప్రాధేయపడగా… చివరకి కళాశాల యాజమాన్యం తనను పరీక్షలు రాయడానికి అనుమతించింది. దీంతో పరీక్షలు రాసిన సురేంద్రన్ టాపర్‌గా నిలిచి తన సత్తా చాటాడు.
ఆ తర్వాత కాలికట్ ప్రభుత్వ లా కళాశాలలో చేరి చదువుకోవడంతో పాటు డబ్బుల సంపాదించడం కోసం హోటల్లో పని చేశారు.ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకుంటూ 1995లో లా డిగ్రీని పూర్తి చేశారు.
అలా లా డిగ్రీని పొందిన ఆయన స్థానికంగా ఉన్న ఓ కోర్టులో జానియర్ లాయర్‌గా ప్రాక్టీసు మెుదలు పెట్టారు. అప్పటి నుంచి తన అద్భుతమైన నైపుణ్యాన్ని కనపరుచుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఆ తరువాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ పరిచయం అవ్వడంతో ఆయన జీవితాన్ని ఆ పరిచయం ఒక మలుపు తిప్పింది.ధావన్ సాయంతో సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీసు ప్రారంభించిన సురేంద్రన్ అక్కడ కూడా విజయం సాధించారు.
అమెరికా ప్రయాణం
అలా వెళ్లిన ప్రతి చోట తన సత్తా చాటుతూ అదరగొట్టిన ఆయన 2004లో తన మనసుకు నచ్చిన శుభను పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి తేర తీశారు. పెళ్లయిన కొంత కాలానికి ఆయన భార్యకు అమెరికాలో స్టాఫ్‌నర్సు ఉద్యోగం రావడంతో సురేంద్రన్ కుటుంబంతో సహా హ్యూస్టన్ కి నివాసం మార్చారు.
అమెరికాకు వెళ్ళిన తరువాత అక్కడ కూడా తన చదువును కొనసాగించిన సురేంద్రన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్ నుంచి 2011లో ఎల్ఎల్ఎం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అలా లాయర్‌గా ప్రాక్టీస్ మెుదులు పెట్టారు.
అక్కడ కూడా అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన టెక్సాస్ జిల్లా జడ్జిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
కోర్టులో తన బాధ్యతలు నిర్వించడం ప్రారంభించిన మొదట్లో ఆయన యాసను చూసి కొందరు తప్పుబట్టగా చాలా పరిణితో వారి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు.”ఒక దేశంలో మనం ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఆ సమాజానికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం”అంటూ వారి నోళ్ళు మూయించారు.
మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, పరిస్థితులు మన భవిష్యత్ ను నిర్ణయించవని తన ధృడమైన సంకల్పంతో, తను సాధించిన విజయాలతో తెలియచేస్తూ ప్రతి ఒక్కరిలో సురేంద్రన్ స్ఫూర్తిని నింపుతున్నారు.
also read:
AP News : ఫేక్ వార్తలతో దుష్ప్రచారం మీకే సొంతం.. నాగబాబుపై రోజా ఫైర్!