HometelanganaTelangana Congress : మాణిక్కం ఠాగూర్‌ ఔట్‌.. సీనియర్ల దెబ్బతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌!

Telangana Congress : మాణిక్కం ఠాగూర్‌ ఔట్‌.. సీనియర్ల దెబ్బతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌!

Telugu Flash News

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ వైదొలిగారు. ఆయన గోవాకు ఇన్‌చార్జ్‌గా మారిపోయారు. కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న వ్యవహారాలతో తలనొప్పిగా భావించిన ఠాగూర్‌.. ఇక తనను ఈ పదవి నుంచి తప్పించాలని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు తెలిపినట్లు సమాచారం. అంతర్గత కుమ్ములాటలను కంట్రోల్‌ చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడని తెలుస్తోంది. అందుకే తనకు ఈ పదవి వద్దని ఖరాకండిగా చెప్పేశారని టాక్‌.

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం మొదలైంది. పీసీసీ కమిటీల నియామకంతో అగ్గిరాజేసినట్లయింది. ముఖ్యంగా సీనియర్లు అలకబూనారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌గా పదవి ఇవ్వడంపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న సీనియర్లు.. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత రచ్చ మొదలు పెట్టారు. పదవుల విషయంలో సీనియర్లకు అన్యాయం జరిగిందని, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కలేదని బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు పలువురు నేతలు.

ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి వర్గం.. అంటే టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు దక్కాయని ఆరోపించారు సీనియర్‌ నేతలు. అయితే, దీనిపై వ్యూహాత్మకంగా రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ ఒక కుటుంబం లాంటిదని, కాంగ్రెస్‌ పార్టీలో కొంచం వాక్‌ స్వాతంత్ర్యం ఎక్కువ కాబట్టి ఎవరి అభిప్రాయం వారు చెబుతారంటూ వ్యాఖ్యానించారు. ఈ గొడవపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించి ఏఐసీసీ తరఫున దూతగా దిగ్విజయ్‌ సింగ్‌ను పంపింది. ఆయన హైదరాబాద్‌కు వచ్చి రెండు రోజులు కాస్త హడావుడి చేసి ఓ నివేదిక తయారు చేసి హైకమాండ్‌కు చేరవేశారు.


సీనియర్ల అటాక్‌తో తప్పుకున్న ఠాగూర్‌..

పీసీసీ పదవులపై మొదలైన రగడ.. తగ్గకపోవడంతో ఇక చేసేది లేక సీనియర్ల ఒత్తిడికి తలొగ్గిన మాణిక్కం ఠాగూర్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన్ను గోవా కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా నియమించింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రకటన వెలువరించింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

manikrao thakre incharge for Telangana Congress
manikrao thakre

Also Read : 

-Advertisement-

amazon : మరో సారి ఉద్యోగాల్లో కోతకు అమెజాన్ రంగం సిద్ధం.. 18 వేల మందిని తొలగించేందుకు ప్లాన్‌!

Viral Video : తమ పార్టీలో డెలివరీ బాయ్ ని కూడా కలిపేసుకున్న బెంగళూరు యువకులు.. నెటిజన్ల ప్రశంసలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News