america weather today : ‘బాంబ్ సైక్లోన్’ అనే మంచు తుపానుతో అమెరికా వణికిపోతోంది. అమెరికాలో ఇప్పటికే 60 మంది మరణించినట్లు సమాచారం. ఈ భయంకరమైన మంచు తుపాను మరో వారం పాటు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో మైనస్ 8 నుంచి మైనస్ 48 డిగ్రీలకు పడిపోయిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు బలమైన ఈదురు గాలులు భయానకంగా ఉన్నాయి. మరోవైపు, బిడెన్ ప్రభుత్వం అమెరికాలో పది రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో న్యూయార్క్, మిచిగాన్, మిన్నెసోటా, మోంటానా, అయోవా, ఇండియానా, విస్కాన్సిన్, నార్త్ డకోటా, సౌత్ డకోటా మరియు అయోవా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంచు కారణంగా చాలా వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లక్షల ఇళ్లకు కరెంటు లేదు. ఒక దశలో 17 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
న్యూజెర్సీలోని అరిజోనాలో మంచు తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మరణించారు. గుంటూరు జిల్లా పెదనడిపాడు మండలం పాలపర్రుకు చెందిన మద్దన నారాయణ, భార్య హరిత ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లారు. మంచు సరస్సు వద్ద ఫొటోలు తీస్తుండగా ఒక్కసారిగా మంచు కుప్పకూలి మంచు సరస్సు అడుగున ఇరుక్కుపోయారు. సహాయక చర్యల్లో హరిత మృతదేహం లభ్యం కాగా, నారాయణ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు పిల్లలు ఒడ్డునే ఉన్నారు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు