HomeSpecial Storiesmystery stories : భయంకరమైన హత్యలతో భయం పుట్టించిన హంతకుడు జాక్ ది రిప్పర్

mystery stories : భయంకరమైన హత్యలతో భయం పుట్టించిన హంతకుడు జాక్ ది రిప్పర్

Telugu Flash News

mystery stories : జ్యూస్ (jews) వాళ్ళు ఇంగ్లాండ్ కి వలస వచ్చిన కాలంలో జరిగిన వరుస హత్యలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి.అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.

1880-90 మధ్య సమయంలో చాలా మంది జ్యూస్ బతుకు తెరువు కోసం ఇంగ్లాండ్ లోని వైట్ ఛాపెల్,ఆల్ట్ గేట్ లాంటి ప్రదేశాలకి వచ్చి తల దాచుకోవడం మొదలు పెట్టారు.

ఇంగ్లాండ్ లో జనాభా ఎక్కువ కావడం వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కవయ్యాయి. దీంతో పొట్ట కూటి కోసం ఏ పని అయినా చేసే జనం కావడంతో చాలా మంది అమ్మాయిలు వేశ్య వృత్తిని ఎంచుకున్నారు.

జాక్ ది రిప్పర్ మొదటి హత్య

జ్యూస్ వాళ్ళు అలా వలస వచ్చిన కొన్నాలకి ఒక రాత్రి మారీ అన్ నికోల్స్ అనే వేశ్య వైట్ ఛాపెల్ డిస్ట్రిక్ట్ లో ఎవరితోనో గోరంగా హత్య చేయబడి కనిపించింది.ఆ తరువాత కొన్ని నెలల వరకు ఇదే విధంగా ఇంకో నలుగురు అమ్మాయిలు హత్యకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ హత్యలపై కేసు దర్యాప్తు చేసి విచారణ మొదలు పెట్టారు.

ఆ విచారణలో పోలీసులకి కొన్ని ఆశ్చర్యకరమైన ఆధారాలు లభించాయి. హంతకుడు ఆ అమ్మాయిలను దారుణంగా కత్తితో కోసి చంపుతున్నాడు. లేదా వాళ్ళ వంట్లో ఎదో ఒక అవయవాన్ని కోసి బయటకు తీసి చంపుతున్నాడు. అయితే అలా అవయవాలను బయటకు తీసిన ప్రతి సారి ఒక నిపునుడిలా చాలా అనుభవం ఉన్న సర్జరీ చేసే డాక్టర్ లా అవయవాలను బయటకు తీస్తున్నాడు. పోలీసులకి ఇవి రెండూ తప్ప ఎంత వెతికినా ఇంకే బలమైన ఆధారాలూ దొరకకపోవడంతో ఈ కేసు విచారణ అలా సాగుతూ వచ్చింది.

జాక్ ది రిప్పర్ దొరికేసినట్టే అనిపించిన సంఘటన

jack the ripperజాక్ ది రిప్పర్ హత్యలు ఎక్కువైన తరువాత “నేనే హంతకుడినీ” అంటూ పోలీసులకి చాలానే ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరాలలో ఉన్న ఒక పేరు ద్వారానే హంతకుడికి “జాక్ ది రిప్పర్” అనే పేరు వచ్చింది. అయితే వాటిలో చాలా వరకు పోలీసులపై గౌరవం లేని వారు,ఫేమస్ అవుదామని అనుకున్న వారు రాసినవే ఉండగా,”From hell” అనే హెడ్డింగ్ తో వచ్చిన ఒక లేక మాత్రం నమ్మశక్యంగా అనిపించింది. కాగా వాటితో కూడా హంతకుడు ఎవరని పోలీసులు ఒక అంచనాకి రాలేక పోయారు.

-Advertisement-

చివరిగా 2014లో డి.ఎన్.ఏ(D.N.A) అనాలిసిస్ లో నిపుణుడు అయిన జారి లౌహెలైన్ హంతకుడు చంపిన నలుగురు అమ్మాయిలలో ఒకరి దగ్గర దొరికిన శాలువాను పరీక్షించడం మొదలు పెట్టాడు. తద్వారా 1880లో ఇంగ్లాండ్ కి వచ్చిన జ్యూస్ లో ఒకడైన పోలిష్ బార్బర్ ఆరోన్ కోస్మిన్స్కి నే అసలైన హంతకుడు అని ఒక అంచనాకి వచ్చేలా చేసాడు.

ఎట్టకేలకు ఒక ఆధారం దొరికిన పోలీసులు ఆరోన్ గురించి విచారణ చేయడం మొదలు పెట్టారు. ఆ విచారణలో అతను కొంత కాలం బార్బర్ గా చేసిన తరువాత మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి ప్రవర్తించేవాడని, కొంత కాలం మెంటల్ హాస్పిటల్ లో కూడా ఉండి వచ్చాడని వెల్లడైంది. దీంతో ఆరోన్ కోస్మిన్స్కి నే హంతకుడిని అందరూ నిర్ధారించుకున్నారు.

కానీ కొన్ని రోజులకు ఒక పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ ఆరోన్ హంతకుడా…..కాదా….. అని అందర్నీ సతమత పరిచే ప్రశ్నను లేవనెత్తింది. ఎనభైలలో జరిగిన హత్యా స్థలం దగ్గర దొరికిన శాలువాని పరీక్షించి హంతకుడు ఎవరనేది ఎలా చెబుతారని,అది చాలా సార్లు చాలా మంది చేతులు మారుటుందని ఆ పత్రిక వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రచురించారు.

దీంతో వీడిపోయింది అనుకున్న మిస్టరీ మళ్ళీ తికమక పెట్టడం మొదలైంది. ఆరోన్ కోస్మిన్స్కి నే నిజమైన హాంతకుడా? లేక ఇంకెవరైనా ఉన్నారా? అసలీ జాక్ ది రిప్పర్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానం లేక ఆ సంఘటన ఇంకా ఒక రహస్యంగా మిగిలిపోయింది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News