తన పాటలతో, మైమరిపించే గాత్రంతో 15 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి వచ్చి సంచలనంగా మారిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ (justin bieber) .అలాంటి వ్యక్తి గురించి తెలియాలి,తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.
జస్టిన్ బీబర్ తల్లి ప్యాటీ మేల్లెట్ కొంతకాలం జెరెమీ జాక్ బీబర్ అనే వ్యక్తితో సన్నిహితంగా మెలిగి పెళ్లి కాకుండానే 1994,మార్చ్ 1న జస్టిన్ బీబర్ కి జన్మనిచ్చింది.
ఆ తరువాత జెరెమీ వాళ్ళను వదిలేసి వెళ్లిపోవడంతో ప్యాటీ మేల్లెట్ ఒంటరి తల్లిగా జస్టిన్ ని పెంచుతూ వచ్చింది.
జస్టిన్ కి మొదటి నుంచి సంగీతంపై ఉన్న ఆసక్తిని చూసిన మేల్లెట్ చిన్నతనం నుంచే పియానో,గిటార్,డ్రమ్స్ ని ప్లే చేయడంలో శిక్షణ ఇప్పించింది.
2012లో స్టాన్ఫోర్డ్ లోని సెయింట్ మైఖేల్ కాథలిక్ సెకండరీ స్కూల్ లో 4.8 జీ.పి.ఏ తో చదువును ముగించుకున్న జస్టిన్ ఇక పై తనకు నచ్చిన సంగీతంవైపే అడుగులు వేసేలా చూసిన మేల్లెట్ జస్టిన్ పాడిన అర్ అండ్ బి మరియు పాప్ పాటలను విడియో లో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం మొదలు పెట్టింది.
అవొన్ థియేటర్ మెట్ల ముందు ఒక గిటార్ ని అద్దెకి తీసుకుని ప్రదర్శనలు ఇచ్చేలా చేసింది. దాంతో జస్టిన్ పాటలకు అభిమానులు,యూట్యూబ్లో వీక్షకులు పెరిగారు.కొంత కాలంలోనే అందరికీ నచ్చిన పాటలు మాంత్రికుడిగా జస్టిన్ పేరుపొందాడు.
జస్టిన్ జీవితంలో పెద్ద మలుపు:
2007లో సో సో డెఫ్ రికార్డింగ్స్ కి ఫార్మర్ మార్కెటింగ్ ఎగ్సిక్యూటివ్ అయ్యిన స్కూటర్ బ్రౌన్ అనుకోకుండా యూట్యూబ్లో జస్టిన్ పాటలు చూసాడు.
తన మైమరిపించే పాటలు విన్న ఆయన జస్టిన్ బీబర్ తల్లి ప్యాటీ మేల్లెట్ ని సంప్రదించాడు.
అయితే క్రిస్టియానిటి పై పిచ్చి నమ్మకం కలిగి ఉన్న మేల్లెట్,స్కూటర్ బ్రౌన్ జుడాయిజం వల్ల జస్టిన్ ను తనతో పని చేయడానికి ముమ్మాటికీ ఒప్పుకోలేదు.
జస్టిన్ భవిష్యత్ బావుంటుందని చర్చ్ లో వాళ్ళు ఒప్పించడంతో ఎట్టకేలకు ఒప్పుకున్న మేల్లెట్ జస్టిన్ కొత్త జీవితానికి తెర తీసింది.
అలా 15 ఏళ్ళకే మొదలైన జస్టిన్ బీబర్ సంగీత ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి ఎవరూ ఊహించని స్థాయికి చేరింది.
అనతి కాలంలోనే అందర్నీ ఆశ్చర్య పరిచి ఎనలేని అభిమానాన్ని పొందిన జస్టిన్ ని అందరూ “ప్రిన్స్ ఆఫ్ టీన్ పాప్”,”కింగ్ ఆఫ్ పాప్” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
రోలింగ్ స్టాండ్ ఇండియా జస్టిన్ ని “biggest popstar of our age” గా పేర్కొంది.
2010లో కొత్తగా వచ్చిన ఆర్టిస్టుగా ఎమ్.టీవి అవార్డును అందుకున్న జస్టిన్ బీబర్,పాప్ సింగర్ గా వచ్చి పోయిన ఏడాదికి దశాబ్ద కాలం అయినప్పటికీ 2021 కి బెస్ట్ ఆర్టిస్టుగా ఎమ్.టీవీ అవార్డ్ ని అందుకుని తన ప్రతిభ,తనపై అభిమానులలో ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
also read news:
Thalapathy vijay’s Varasudu Video Song ‘Soul of Vaarasudu (Telugu)’ Released
Anupama Parameswaran photos at 18 Pages Movie Pre Release Event