హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. సీఎంగా సుఖ్వీందర్ సింగ్, డిప్యూటీ సీఎంగా అగ్నిహోత్రిలతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం అయ్యాక హిమచల్‌ప్రదేశ్‌ను ఆరు సార్లు పాలించిన రాజవంశీకుడు, దివగంత వీరభద్ర సింగ్‌కు వేదికపైనే నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం అయితే చేశారుగానీ ఆయన ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.
తొలుత సీఎం పదవి కోసం పలువురు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ బాధ్యతను ప్రియాంకా గాంధీకి అప్పగించింది. మొదట ఎవరిని సీఎంగా చేయాలన్న దానిపై అధినాయకత్వం తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు ఈ అంశానికి తెరదించుతూ సుఖ్వీందర్ సింగ్‌ను సీఎంగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సుఖ్వీందర్ సింగ్ ఓ బస్సు డ్రైవర్ కుమారుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించే వరకు ఎదిగారు.
అసలైన సవాల్ అదేనా?
కొత్త ముఖ్యమంత్రి ఎంపిక సందర్భంగా హిమాచల్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలుగా విడిపోయారని కథనాలు వచ్చాయి. సీఎం పదవి తమదంటే తమదేనంటూ ముఖ్య నేతలు ప్రచారం చేసుకున్నారు. ప్రతిభాసింగ్, ముఖేష్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే సుఖ్వీందర్‌వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ఏర్పడిన గ్రూపు రాజకీయాల్ని నియంత్రించి ఆయన పాలనలో నెగ్గుకురావడం ఇప్పుడు అసలైన సవాల్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read news:
Kavitha: కవిత ఇంట్లో సీబీఐ బృందం.. విచారణ ఎలా సాగుతోందంటే..!
Prabhas : అన్‌స్టాపబుల్ సీజన్-2 టాక్ షో కి ప్రభాస్.. కన్ఫర్మ్ చేసిన ఆహా సంస్థ.. వీడియో వైరల్