HomebusinessGold Rates: బాబోయ్ .. ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌లు..

Gold Rates: బాబోయ్ .. ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌లు..

Telugu Flash News

Gold Rates: బంగారం ధ‌ర‌లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌సారి భారీగా పెర‌గ‌డం, అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే త‌గ్గ‌డం జ‌రుగుతుంది. శుక్ర‌వారం రోజు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే

10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 47,850కి చేరింది. గురువారం ఈ ధర రూ. 47,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 1000 పెరిగి, రూ. 4,78,500కి చేరింది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 100 పెరిగి.. రూ. 52,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,100గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 1000 పెరిగింది

ప‌రుగులు పెట్టిన బంగారం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,000గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా కొన‌సాగుతుంది.

కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,850 గా ఉంది.. 24 క్యారెట్ల గోల్డ్​.. 52,200గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,400గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800గా కొన‌సాగుతుంది.. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 47,880గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,230గాను ఉండ‌డం గ‌మ‌న‌ర్హం.

-Advertisement-

మ‌న హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200గా కొన‌సాగుతుంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతుండ‌గా,విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 52,250గా ఉంది.

భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 47,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200గా కొన‌సాగుతుంది.

వెండి విష‌యానికి వ‌స్తే.. దేశంలో వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,150గా కోన‌సాగుతుంది. ఇక కేజీ వెండి ధర రూ. 500 దిగొచ్చి.. 61,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 62,000గా ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News