Horoscope today:
27-09-2022 మంగళవారం రాశి ఫలాలు
మేష రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులని సకాలంలో పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ధన సహాయాన్ని అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం మీ ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది.. ఈ రోజు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య సరైన సామరస్యం ఉంటుంది.
మిథున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లల విద్యకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. చెడు అలవాటు లేదా ప్రతికూల కార్యకలాపాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి: ఈ రాశివారు మానసిక బలం తగ్గకుండా చూసుకోవల్సి ఉంటుంది. విద్యార్థులు, యువత పూర్తిగా తమ చదువులు, వృత్తిపై దృష్టి పెడతారు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కోర్టు కేసులపై ఈ రోజు ఫలితం వస్తుంది. మీ కుటుంబ సభ్యుల వైవాహిక బంధంలో పలు రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశ ఉంది.
కన్య రాశి: ఈ రాశివారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు సోషల్ మీడియాలో, స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయకుండా ఉండాలి
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు సమయానికి తగిన నిద్రాహారాలు తప్పనిసరి. చేపట్టిన పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆదాయ వనరులు బాగానే ఉంటాయి. దానికి తగ్గ ఖర్చులు కూడా అంతే ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులు, బట్టలను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మరోవైపు యువకులు తమ కెరీర్లో విజయం సాధించడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలి.
ధనస్సు రాశి: ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక తమ పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు.
మకర రాశి: ఈ రాశివారు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రశాంతమైన ఆలోచనతో శుభఫలితాలను అందుకుంటారు. ఈరోజు అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. లేదంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు పదిమందిలో మంచి పేరు సంపాదిస్తారు. కొన్నిసార్లు ఏదైనా విషయంలో చాలా మొండిగా ఉండటం వల్ల మీరు ముఖ్యమైన విజయాలు మీ నుండి చేజారిపోతాయి.
మీన రాశి: ఈ రాశివారు బాధను కలిగించే వార్తను వింటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఈరోజు మీ పిల్లలు విద్యపై ఎక్కువ ఏకాగ్రత చూపుతారు.