Homenationalథానే ఎక్స్‌ప్రెస్‌వే సైట్‌ ప్రమాదంలో 16 మంది మృతి

థానే ఎక్స్‌ప్రెస్‌వే సైట్‌ ప్రమాదంలో 16 మంది మృతి

Telugu Flash News

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానేలోని షాపూర్ సమీపంలో నిర్మాణ స్థలంలో గత అర్థరాత్రి క్రేన్ కూలిపోవడంతో 16 మంది కార్మికులు చనిపోయారు.

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులపై క్రేన్ పడిపోవడంతో వారు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురు కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, గాయాలతో చికిత్స పొందుతున్నారు. కూలిన నిర్మాణంలో మరో ఐదుగురు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

షాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున షాపూర్‌లోని సర్లాంబే గ్రామ సమీపంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే మూడో దశ నిర్మాణంలో కార్మికులు పని లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేసి, బాధిత కుటుంబాలకు  ₹ 2 లక్షల పరిహారం ప్రకటించారు .

-Advertisement-

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News