Telugu Flash News

Zero Shadow Day in Hyderabad : ఈనెల 9న హైదరాబాద్‌లో జీరో షాడో డే..

Zero Shadow Day in Hyderabad

Zero Shadow Day in Hyderabad : జీరో షాడో డేపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొన్నామధ్య బెంగళూరులో మిట్ట మధ్యాహ్నం జీరో షాడో డే సందర్భంగా నీడ కనిపించలేదు. ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

హైదరాబాద్‌ నగరంలో ఈనెల 9న అద్భుతం ఆవిష్కృతం కానుందట. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు సుమారు రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారి ఎన్.హరిబాబు శర్మ తెలిపారు.

ఆ సమయంలో నగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడు ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాల పాటు కనిపిందని చెప్పారు.

ఈనెల 9వ తేదీనే కాకుండా ఆగస్టు 3వ తేదీన కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని హరిబాబుశర్మ చెప్పారు. మరోవైపు ఏప్రిల్ 25న సరిగ్గా మధ్యాహ్నం 12.17 నిముషాలకు ఈ నీడలు కనిపించకుండా పోతాయని శాస్త్రవేత్తలు సైతం అప్పుడే చెప్పారు.

జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్యుడి కాంతి పడినా నీడ కనిపించదు. ఇలా జరగడాన్ని టెక్నికల్ పరిభాషలో జెనిత్ పొజిషన్ అని పిలుస్తారట. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

Exit mobile version