HomeinternationalZelensky : అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రసంగం అదుర్స్‌.. స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చిన ప్రతినిధులు!

Zelensky : అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రసంగం అదుర్స్‌.. స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చిన ప్రతినిధులు!

Telugu Flash News

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం పది నెలలుగా కొనసాగుతోంది. యుద్ధం ఆపాలని, రష్యా దమననీతిని ప్రపంచ దేశాలకు చెబుతూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ (Zelensky) శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోనూ చాలా మంది తల్లులు తమ బిడ్డలైన సైనికులను కోల్పోయారు. సాధారణ పౌరులు సైతం వందలాది మంది అసువులుబాశారు. ఈ నేపథ్యంలో తాజాగా జెలెన్‌ స్కీ అమెరికాలో పర్యటించారు.

అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్న జెలెన్‌స్కీ.. అమెరికా చేస్తున్నది సాయం కాదని.. పెట్టుబడి అని అభివర్ణించారు. బైడెన్‌తో అనేక అంశాలు చర్చించిన జెలెన్‌ స్కీ.. అక్కడి అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేస్తున్న నిధులు, ఆయుధాలు వంటివి విరాళం కాదని, ఇన్వెస్ట్‌మెంట్‌తో సమానమని జెలెన్‌స్కీ చెప్పారు. ప్రపంచ భద్రత, ప్రజా సమస్యలకు పెట్టుబడి అని తెలిపారు. తాను అమెరికాకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని జెలెన్‌స్కీ చెప్పారు.

ఎన్ని కష్టాలు వచ్చినా ఉక్రెయిన్‌ తలవంచదని, కుప్పకూలిపోదని ధీమా వ్యక్తం జెలెన్‌స్కీ చేశారు. ప్రపంచం దృష్టిలో రష్యాను ఓడించామన్నారు. శాంతి కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్‌ మద్దతునివ్వడం సంతోషంగా ఉందని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా బలంగా, సమష్టిగా ఉందని చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అమెరికన్‌ కాంగ్రెస్‌లో జెలెన్‌స్కీ ప్రసంగానికి సభ్యులు ఫిదా అయ్యారు. పోరాట పటిమను మెచ్చుకుంటూ రెండు నిమిషాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు ప్రతినిధులు. కరతాళ ధ్వనులతో అభినందించారు.

ఉక్రెయిన్‌ ఒంటరి కాదు.. మేమున్నాం: బైడెన్‌

మరోవైపు జెలెన్‌స్కీ ఖాకీ స్వెట్‌ షర్ట్‌లోనే అమెరికాలో పర్యటించడం ఆసక్తి కలిగిస్తోంది. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి జెలెన్‌స్కీ మిలిటరీ రంగు దుస్తులనే ధరిస్తున్నారు. తాజాగా యుద్ధ క్షేత్రంలో పర్యంచిన జెలెన్‌స్కీ.. సైనికుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించారు. జెలెన్‌స్కీ అమెరికన్‌ పర్యటన సందర్భంగా జో బైడెన్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ ఎప్పటికీ ఒంటరి కాదని, అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్దన్న అండగా నిలవడంతో ఇక రష్యాతో యుద్ధం రసవత్తరంగా మారనుందనే విశ్లేషణలు వస్తున్నాయి.

also read news: 

viral video today : నేను నీ సర్వెంట్‌ కాదు.. ఉద్యోగిని.. ఇండిగో విమానంలో ప్రయాణికుడు-ఎయిర్‌ హోస్టెస్‌ మధ్య వాగ్వాదం

-Advertisement-

Coronavirus In India : కరోనా మళ్ళీ విజృంభిస్తోందా? దేశంలో మళ్ళీ లాక్ డౌన్ పడుతుందా? BF 7 వేరియంట్ పై కొత్త మార్గదర్శకాలు

Taj Mahal : తాజ్ మహల్ చరిత్ర, మీరు తెలుసుకోవలసిన అత్యద్భుత నిర్మాణ విశేషాలు

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News