Telugu Flash News

Yuvraj Singh Virat Kohli : ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే ఫ్రేములో.. మ్యాచ్ ముందు అంత సీరియ‌స్‌గా ఏం చ‌ర్చించుకుంటున్నారు..!

Yuvraj Singh Virat Kohli

Mohali: మొహ‌లీ వేదిక‌గా ఆస్ట్రేలియా, టీమిండియా మ‌ధ్య జ‌రిగిన తొలి మ్యాచ్‌లో భార‌త్ దారుణమైన ప‌రాజ‌యం చ‌వి చూసిన విష‌యం తెలిసిందే. భారీ టార్గెట్‌ని నిర్ధేశించిన కూడా ఆస్ట్రేలియా దానిని అవ‌లీల‌గా చేదించింది. దీంతో భార‌త్ ఆట‌గాళ్ల ఆట‌తీరుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే 2007 టి20 ప్రపంచకప్ , 2011 వన్డే ప్రపంచకప్ లలో భారత్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన యువ‌రాజ్ సింగ్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌లని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.

మొహాలీ స్టేడియంలోని రెండు స్టాండ్స్ కు వీరి పేర్లను పంజాబ్ క్రికెట్ సంఘం పెట్టింది. నిన్న జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా వీటిని ఆవిష్క‌రించారు.

ఫ్రేము అదిరింది..

ఇక మ్యాచ్ ప్రారంభం స‌మ‌యంలో విరాట్ కోహ్లీ, యువ‌రాజ్ సింగ్ గ్రౌండ్‌లో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఏదో విష‌యంపై వీరిద్ద‌రు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. బ‌హుశా టీమిండియా ఆట‌తీరుతో పాటు జ‌ట్టు ఎంపిక‌పై చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇద్ద‌రు లెజెండ్స్ ఒకే ఫ్రేములో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలి టీ20లో పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో దారుణ‌మైన ఓటమిపాలైంది.

మూడు టీ20ల సిరీస్‌లో ఆరోన్ ఫించ్ సేన 1-0తో ఆధిక్యంలో ముందంజ‌లో నిలిచింది. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయ‌డంతో పాటు దారుణ‌మైన ఫీల్డింగ్‌కూడా మ్యాచ్ ఓట‌మికి కార‌ణ‌మైంద‌నే చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా మూడు క్యాచ్‌లు నేలపాలు చేయ‌డం పెద్ద ఎఫెక్ట్ చూపించింది. కామెరూన్ గ్రీన్ ఆరంభంలో ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను అక్షర్ పటేల్ నేలపాలు చేయ‌డంతో పెద్ద మూల్య‌మే చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చింది.

Exit mobile version