Telugu Flash News

YSRCP MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. మరోసారి సామాజిక బాణం వదిలిన జగన్‌!

YSRCP MLC Candidates : ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పండగ వచ్చింది. స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైసీపీ సోమవారం ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను జగన్‌ సర్కార్‌ వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చచారని సజ్జల తెలిపారు.

సామాజిక న్యాయానికి వైసీపీ కట్టుబడి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. బీసీలంటే.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌.. అని తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మారని, అందుకే వారికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ తమది కాదన్నారు. వెనుకబడిన వర్గాలను అధికారంలో భాగస్వామ్యం చేయడమే తమ కర్తవ్యమన్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష టీడీపీకి మరోసారి సామాజిక బాణం వదిలినట్లయిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణలను తెరపైకి తెచ్చారని విశ్లేషణలు వస్తున్నాయి.

వైసీపీ 18 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులు వీరే..

స్థానిక సంస్థల కోటాలో: 9
ఎమ్మెల్యే కోటాలో: 7
గవర్నర్ కోటాలో: 2

ఎస్సీ: 2
ఎస్టీ: 1
బీసీ: 11
ఓసి: 4

స్థానిక సంస్థలు:

1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా:

10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా:

17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ

also read :

Karnataka : ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్.. కర్ణాటకలో వీధికెక్కి ఇద్దరు మహిళా అధికారుల పోరు

Baahubali: బాహుబ‌లి ప్రీక్వెల్‌కి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయా ?

Exit mobile version