విశాఖపట్నంలో సీతకొండ వ్యూ పాయింట్.. ఇప్పుడు వైఎస్సార్ వ్యూ పాయింట్ (YSR View Point) గా మార్చడంతో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జీ20 సన్నాహక సదస్సు నేపథ్యంలో ఇక్కడి వ్యూ పాయింట్‌ను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
ఇందుకోసం రూ.3.42 కోట్లు కేటాయించినట్లు నగర మేయర్ వెల్లడించారు. అయితే, ఇది అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని, దీన్ని కూడా పేరు మార్చడం శోచనీయమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు చంద్రబాబుకు కౌంటర్ ఇస్తున్నారు.
వాస్తవానికి జీ20 సన్నాహక సదస్సు సందర్భంగా ఇక్కడ అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ ప్రాంతానికి వైఎస్సార్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టాలని మధురవాడ జోనల్ కార్యాలయ ప్రణాళిక విభాగం నిర్ణయించింది.
ఈ ఫైలుకు గత నెలలోనే మేయర్ గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చారు. దీంతో 150 మీటర్ల పరిధిలో ఇక్కడ అభివృద్ధి చేసి అనంతరం వైఎస్సార్ వ్యూ పాయింట్ అని నేమ్ ప్లేట్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియాలోనూ, పార్టీ నేతలు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
రాష్ట్రానికి కూడా వైఎస్సార్ ప్రదేశ్ అని పేరు మార్చాలంటే సెటైర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. తొలుత జనసేనకు చెందిన ఓ నేత అబ్దుల్ కలాం పేరును మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీన్ని చంద్రబాబు అందుకొని ఇంగ్లిష్‌లో ట్వీట్ చేశారు.
ఇది కాపీ పేస్ట్ అని, కనీసం నిజానిజాలు తెలుసుకొని ట్వీట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు బాబుపై విరుచుకుపడుతున్నారు. వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పుడు అభివృద్ధి చేసినా కంటగింపు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
విశాఖలోని జోడుగుళ్లపాలెం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ మేరకు జీ20 సన్నాహక సమావేశం నేపథ్యంలో ఈ ప్రాంతం సుందరంగా తీర్చి దిద్దినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి పెయింటింగ్స్ వేశారని, నడక దారితో పాటు మార్బుల్స్, కూర్చొనే బెంచీలు, లవ్ వైజాగ్ లాంటి చిహ్నాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అనంతరం ఆ ప్రాంతానికి వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశామంటున్నారు. మొత్తానికి ఈ వివాదం ఏపీలో చర్చనీయాంశమైంది.
also read news :
Keerthy Suresh: రిసార్ట్ ఓనర్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. నిజమెంత ?
Anasuya: నీ కొడుకులకి వంట నేర్పించు అంటూ అనసూయకి కౌంటర్.. ఎలా రెస్పాండ్ అయిందంటే..!