Telugu Flash News

తెలంగాణలో ఐదు రోజుల అలర్ట్.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే..

రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొమురంభీం, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి, నిర్మల్, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుంది.

ఈ నెల 12న (ఆదివారం) ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ సోమవారం హన్మకొండ, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 14, 15 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

also read :

Auto Ram Prasad: త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లకు క్లారిటీ ఇచ్చిన ఆటోరాం ప్ర‌సాద్

Shyamala: అడ్డంగా బుక్ అయిన యాంక‌ర్ శ్యామ‌ల‌.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

 

Exit mobile version