Yashoda Movie Review :
నటీనటులు: సమంత ,ఉన్ని ముకుందన్ , మురళి శర్మ, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్,
దర్శకుడు : హరి , హరీష్
నిర్మాత : శివ లెంక కృష్ణ ప్రసాద్
బ్యానర్లు : శ్రీదేవి మూవీస్
మ్యూజిక్ : మణిశర్మ
డీఓపీ : ఏం సుకుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
యశోద మూవీ రేటింగ్: 3 /5
లేడి స్టార్ హీరోయిన్ సమంత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తుంది. యూటర్న్, ఓ బేబి చిత్రాలతో అలరించిన సమంత ఇప్పుడు యశోద, శాకుంతలం చిత్రాలతో అలరించేందుకు సిద్ధమైంది.నేడు యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించగా, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పుడు సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
కథ:
పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లులుగా మారుస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. సరోగసీ విషయంలో పెద్ద మాఫియా నడుస్తుంది. ఆ మాఫియా చేసే అకృత్యాల వల్ల బలైన ఎంతోమంది యువతులు ఉండగా, వారిలో ఒకరు యశోద..అసలు సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఏమిటి..? సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను వారు ఏమి చేస్తున్నారు..? యశోద ఛేదించిన ఆ భయంకరమైన నిజాలు ఏమిటి ? అంత పెద్ద మాఫియా సామ్రాజ్యం ని యశోద ఒక్కతే ఎదుర్కొని ఎలా గెలిచింది? అనేది సినిమా మిగతా కథ.
విశ్లేషణ:
ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు హరి- హరీష్. కథ, స్క్రీన్ ప్లే విషయంలోచాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది..ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
సమంత నటన
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే
ఇంటర్వెల్ సన్నివేశం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్లోగా సాగిన స్క్రీన్ ప్లే
చివరిగా..
ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద సినిమా అద్బుతం అని చెప్పాలి . సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి ఇతర నటీనటులు ఆమెకు ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా అంతా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఓ క్రైమ్ యాక్షన్ స్టోరీకి ఎమోషన్స్ జోడించి దర్శకులు హరి-హరీష్ ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగగా, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో ఆకర్షణ. సరోగసీకి బలవుతున్న అమాయకపు మహిళల గురించి ఆలోచింపజేసే చిత్రంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచారు.
also read news:
Bigg Boss 6: కెప్టెన్సీ ఫైట్.. రచ్చగా మారిన గేమ్.. రేవంత్ రూల్స్‌తో విసిగిపోయిన రోహిత్