Twitter: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విటర్‌ని ఎలోన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత దేశంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్‌లో పెద్ద మొత్తంలో ఉద్యోగులపై వేటు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు సంబురాలు చేసుకుంటున్నారు. 25 ఏళ్ల భారత కుర్రాడు యష్ అగర్వాల్‌ని కూడా కంపెనీ ఉద్యోగం నుంచి తీసేయడంతో తను సంబర పడిపోయాడు. ఎవరైనా ఉద్యోగం పోతే ఆందోళన చెందుతారు. కానీ యష్ అలా కాకుండా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టాడు. ట్విటర్‌తో పాటు లింక్డిన్‌లో కూడా ఈ పోస్టును షేర్ చేశాడు. ఈ పోస్టుకి #lovetwitter, #lovewhereyouworked అనే హ్యాష్‌ట్యాగ్‌లను జతచేయగా,ఈ పోస్ట్ తెగ వైరల్‌గా మారింది.
ఉద్యోగం పోయిన ఆనందం..
‘‘ఇప్పుడే నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. బర్డ్ యాప్, ఈ టీమ్‌లో, కల్చర్‌లో భాగం కావడం ఒక గొప్ప అవకాశం, ఎంతో గర్వకారణం అంటూ యష్ ట్విటర్‌లో తన పోస్టును షేర్ చేశాడు ఈ పోస్టులో యష్ అగర్వాల్ ఎంతో సంతోషంగా కనిపిస్తూ. ఒక చేతిలో బ్లూరంగు దిండుపై ట్విటర్ లోగోను, మరో చేతిలో యెల్లో కలర్ దిండుపై ట్విటర్ లోగోను పట్టుకుని తన సంబరాన్ని వ్యక్తపరచాడు. ఎంతో మంది ట్విటర్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోగా, మంది ఉద్యోగులు నిరుత్సాహపడుతుంటే.. యష్ అగర్వాల్ మాత్రం తన సంబరాన్ని ఇలా తెలియజేయడం అందరిని ఆకట్టుకుంటోంది.
Just got laid off.
Bird App, it was an absolute honour, the greatest privilege ever to be a part of this team, this culture 🫡💙#LoveWhereYouWorked #LoveTwitter pic.twitter.com/bVPQxtncIg— Yash Agarwal✨ (@yashagarwalm) November 4, 2022
యష్ పోస్ట్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. జీవితం విషయంలో ఇలాంటి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా అరుదు అనే చెప్పాలి. మీరు కోరుకుంటోన్న సంతోషం, విజయానికి చేరువ్వాలని కోరుకుంటున్నాం. మీ భవిష్యత్ ప్రయత్నాలకు బెస్ట్ విషెష్’’ అంటూ యష్ పోస్టుకి ఒక యూజర్ కామెంట్ చేసి అతనికి ధైర్యాన్ని అందించాడు. మీకు మరింత ఉన్నతమైన అవకాశం చేరువవుతుందని మరో యూజర్ కోరుకున్నాడు. యష్ అగర్వాల్ ట్విటర్ ఇండియా, సౌత్ ఏసియాకు పబ్లిక్ పాలసీ అసోసియేట్‌గా పనిచేసేవాడు .. ఇండియా, సౌత్ ఏసియాలో పాలసీ టీమ్‌కి పాలసీ రీసెర్చ్ అనాలసిస్ వర్క్ కూడా చేశాడు..
also read:
Bigg Boss 6: బెలూన్ టాస్క్‌లో గెలిచిందెవరు? హౌజ్‌కి కొత్త కెప్టెన్‌గా లేడీ బాస్..
horoscope : 5-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు