ఇటీవల సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నయశస్వి కొండెపూడి (Yasaswi Kondepudi) ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. సరిగమప విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రోమో విడుదల చేయడంతో యశస్వి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి, తాను చేసిన సేవా కార్యక్రమాలను వివరించాడు. ఇది పబ్లిక్‌లోకి వెళ్లడంతో నవసేవా ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యశస్వి చేసిందేమీ లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు.
నవసేవ ఎన్జీవో ద్వారా 60 మంది దాకా పిల్లలను చదివిస్తున్నట్లు యశస్వి చెప్పాడని, ఇది వాస్తవం కాదంటూ ఆమె మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారంపై తాజాగా సింగర్ యశస్వి రెస్పాండ్ అయ్యాడు. నవసేవలో పిల్లలను దత్తత తీసుకున్నట్లు తానెక్కడా చెప్పలేదని పేర్కొన్నాడు. తాను అసలు వాళ్ల దగ్గరకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చాడు. తనకు ఈ వ్యవహారంతో సంబంధమే లేదన్నాడు. అయితే, తమ కుటుంబమంతా సాధ్య ఫౌండేషన్‌కు సాయం చేస్తుంటామన్నాడు.
ఈ ఫౌండేషన్.. వారికి నచ్చిన వారికి సాయం చేస్తుంటుందని, అలా కాకినాడలోని ఓ అనాధాశ్రమానికి సాయం చేశారని తెలిపాడు. తమ సోదరులు సాధ్య ఫౌండేషన్‌కు సాయం చేశారని, దీని ద్వారా వారు నవసేవ ట్రస్టుకు మూడు, నాలుగు సార్లు సాయం చేశారన్నాడు. అయితే, వాళ్లతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకోవడానికి తాము షూట్ చేసినట్లు తెలిపాడు. కానీ, నవసేవ నిర్వాహకురాలు ఫరా కుటుంబం ఎదురుగానే పిల్లలతో విషెస్ చెప్పించుకున్నామన్నాడు.
ఆ వీడియోల్లో నవసేవ బోర్డు కనిపించిందన్నాడు. తమ బోర్డు వాడుకున్నారు.. కానీ పిల్లలను చూపించలేదని ఫరా అడిగిందన్నాడు. ఇది కేవలం ప్రోమోఅని, మొత్తం కార్యక్రమంలో కనిపిస్తారని చెప్పడంతో ఆమె రాద్దాంతం చేయడం మొదలు పెట్టిందన్నాడు. అందువల్ల ప్రోమో, ఈ ఎపిసోడ్లో పిల్లలకు సంబంధించిన అంశాలేవీ లేకుండా ఎడిటింగ్ చేసేయాలని చెప్పానన్నాడు.
తమ సంస్థ బోర్డు చూపించినందుకు అనాధాశ్రమాన్ని తొమ్మిది నెలలు దత్తత తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసిందన్నాడు. తోచినంత సాయం చేస్తాను గానీ దత్తత ఎలా తీసుకుంటానని చెప్పడంతో ఆమె లీగల్‌గా వెళ్తానని బెదిరింపులకు పాల్పడిందని యశస్వి తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక సరేనన్నానని చెప్పాడు. తనకు బుద్ధి తక్కువై ఈ ఎపిసోడ్ చేశానంటూ యశస్వి తెలిపాడు.
also read:
Bandi Sanjay : కొత్త సెక్రటేరియట్ డోమ్‌లు కూల్చేస్తామన్న బండి.. నేతల తీరు మారదా?
Pushpa 2 : పుష్ప2 లో బన్నీతో రచ్చ చేయబోతున్న హనీ రోజ్..