HomesportsWTC Final 2023 Winner : భారత్ ఘోర పరాజయం.. టెస్టు చాంపియ‌న్‌షిప్ విజేత ఆసీస్‌

WTC Final 2023 Winner : భారత్ ఘోర పరాజయం.. టెస్టు చాంపియ‌న్‌షిప్ విజేత ఆసీస్‌

Telugu Flash News

WTC Final 2023 Winner 

ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 444 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కి దిగిన భారత్ 234 పరుగులకే కుప్పకూలింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుత సీజన్ లో ఎలాగైనా టైటిల్ గెలుస్తామని భావించిన అభిమానుల ఆశలపై టీమిండియా ఆటగాళ్లు నీళ్లు చల్లారు.

చివరి రోజు భారీ లక్ష్యంలో కనీసం ప్రతిఘటన కూడా లేకుండానే ఓటమిని చవిచూసింది. కోహ్లి (49), రహానే (46) సాయం చేద్దామనుకున్నా రవీంద్ర జడేజా (0), శార్దూల్ ఠాకూర్ (0) వచ్చి పోయారు.

ఆంధ్రా ఆటగాడు శ్రీకర భరత్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్, సిరాజ్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు.

ఫలితంగా టీమిండియా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

-Advertisement-

భారత ఐసీసీ ట్రోఫీ పదేళ్ల కలను సాకారం చేస్తారు అనుకుంటే టీమ్ ఇండియా సభ్యులు తీవ్ర నిరాశకు గురి చేశారు. భారత్ ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కాగా, 444 పరుగుల భారీ లక్ష్యంతో 164/3 స్కోరు వద్ద ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్.. డ్రా కూడా అందుకోకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ కాగా, ఇండియా 296 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.

read more news :

Basit Ali : రాహుల్ ద్రావిడ్ పై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News