Homenationalwrongful conviction : నాకు లైంగిక సుఖాన్ని దూరం చేశారు.. 10 వేల కోట్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన మాజీ ఖైదీ

wrongful conviction : నాకు లైంగిక సుఖాన్ని దూరం చేశారు.. 10 వేల కోట్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన మాజీ ఖైదీ

Telugu Flash News

wrongful conviction : తప్పు చేసిన వాళ్ళు తప్పక జైలుకి వెళ్ళాలని అంటారు. కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడని తేలక ముందే, సరైన ఆధారాలు దొరకక ముందే రెండు మూడు కేసులు పెట్టేసి జైలుకి పంపితే. అతనిని రెండేళ్లు బయట ప్రపంచం తెలియకుండా జైలులో మగ్గ పెడితే. మధ్యప్రదేశ్ కి చెందిన కాంతిలాల్ భీల్ అనే ట్రైబల్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు.ఇప్పుడు అందుకు ప్రభుత్వాన్ని పరిహారం చెల్లించమని కోరుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ కి చెందిన 35 ఏళ్ల కాంతిలాల్ భీల్ 2018 జూలై 20న గ్యాంగ్ రేప్ మరియు కిడ్నాప్ చేశాడని ఆరోపించబడడంతో IPC 366,376 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడి 2020 డిసెంబర్ 23న అరెస్ట్ అయ్యాడు.

అయితే గత ఏడాది అక్టోబర్ 10న ప్రాసిక్యూషన్ నేరాన్ని నిర్ధారించడంలో కేసులోని ప్రధాన అనుమానాన్ని గుర్తించడంలో విఫలమైందని సెషన్స్ కోర్టు వెల్లడిస్తూ ఈ కేసులో అరెస్టైన నిందితులిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో రెండేళ్ల పాటు జైల్లో మగ్గిపోతున్న కాంతిలాల్ భీల్ బయటకి వచ్చాడు.

wrongful conviction for kantilal bheel caseఇప్పుడు ఇన్నేళ్ళు జైల్లో ఇరుక్కుపోయి తన జీవితాన్ని కోల్పోయిన కాంతిలాల్ తను తప్పు చేయకుండా శిక్షను అనుభవించినందుకు గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని నష్ట పరిహారం అడుగుతున్నాడు.అది కూడా 10 వేల కోట్లు.

శృంగార జీవితాన్ని కోల్పోయాను

ఈ రెండేళ్ళలో కాంతిలాల్ తన భార్యా పిల్లలతో తను ఉండలేక పోయాననీ, తన పిల్లలతో సంతోషంగా గడప లేక పోయాననీ ఆ రోజులు తనకు తిరిగి రావు కాబట్టి తనకు నష్టపరిహారం ఇవ్వాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.

ఈ రెండేళ్ల జైలు జీవితంలో తను మానసికంగా మరియు శారీరికంగా చాలా దెబ్బ తిన్నననీ,మానవులకు దేవుడిచ్చిన వరం అయిన శృంగారం, లైంగిక ఆనందాలను తను కోల్పోయాయని పిటిషన్‌లో తెలిపాడు.



తను జైలులో ఉన్న కాలంలో తనకు చర్మ వ్యాధి, కొన్ని ఇతర వ్యాధులు సోకాయని, వాటిని తను జీవితాంతం ఎదుర్కోవాలని, వీటికి కారణమైన ప్రభుత్వాన్ని నష్ట పరిహారం అడగడం తప్పా… అంటూ కాంతిలాల్ ప్రశ్నించాడు.

-Advertisement-

దేవత దయవల్ల, ఒక మంచి మనసున్న న్యాయవాది ఉచితంగా సాయం చేయడం వల్ల తను బయట పడ్డాననీ కాంతిలాల్ చెప్పుకొచ్చాడు.

“నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తీర్చలేదు,నేను కోల్పోయిన జీవితాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకు రాలేదు. కాబట్టి నా తప్పు లేక పోయినా నన్ను శిక్షించిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నాకు నష్ట పరిహారం చెల్లించాలి” అంటూ తన మనోవేదనను కాంతిలాల్ వ్యక్తం చేశాడు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వంపై రూ 10వేల కోట్ల దావా వేశాడు.

ఈ విషయంలో కాంతిలాల్ కి న్యాయం జరుగుతుందా…తను కోరుకున్నంత పరిహారాన్ని ప్రభుత్వం ఇస్తుందా….మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కాంతిలాల్ పిటీషన్ పై ఎలా స్పందిస్తుంది.ఇవన్నీ తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

also read:

Lighter: మ్యాచ్ మ‌ధ్య‌లో సిగ‌రెట్ లైట‌ర్ అడిగిన క్రికెటర్.. దానితో ఏం చేశాడో తెలుసా?

Maldives : సెలబ్రిటీల బెస్ట్ డెస్టినేషన్ మాల్దీవుల గురించి మీకెంతవరకు తెలుసు ?

Pavitra- Naresh: ప‌విత్ర లోకేష్- నరేష్‌ కిస్ వెన‌క సీక్రెట్ పెళ్లి కాదు.. మ‌రొక‌టి ఉంది..!

amazon : మరో సారి ఉద్యోగాల్లో కోతకు అమెజాన్ రంగం సిద్ధం.. 18 వేల మందిని తొలగించేందుకు ప్లాన్‌!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News