రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ వివరాలు విడుదలయ్యాయి. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వివరాలను ప్రచురించాయి. కీలకాంశాలు వెలువడుతున్నాయి. బ్రిజ్ భూషణ్‌పై ఓ మహిళా రెజ్లర్ ఆరోపణ ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశాల్లో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన సమయంలో బ్రిజ్ భూషణ్ తనతో అసభ్యంగా మాట్లాడాడని రెజ్లర్ ఆరోపించింది. తన కోరిక నెరవేరితే చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఫెడరేషన్ భరిస్తుందని హామీ ఇచ్చారు.
బ్రిజ్ భూషణ్ కు భయపడి వీలైనంత వరకు గది నుంచి బయటకు రావడం మానేసినట్లు రెజ్లర్లు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. బయటకు వెళ్లాలంటే నలుగురైదుగురు కలిసి వచ్చేవారని వివరించారు. అయితే ఒకరిని పక్కకు తీసుకెళ్లి అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు. కోచ్ లేని సమయంలో అతను వచ్చి తమతో దురుసుగా ప్రవర్తించేవాడని చెప్పారు. మరో రెజ్లర్ తన టీ షర్టును పైకి లాగి తన ఛాతీని, కడుపుని అభ్యంతరకరంగా తాకాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
read more news :
IPL 2023 : ధోనీ కాకుండా ఐపీఎల్ ట్రోఫీని రాయుడు ఎందుకు తీసుకున్నాడో తెలుసా ?