World Coldest City : ప్రస్తుతం శీతాకాలం నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు మంచు గుప్పెట్లో చిక్కుకున్నాయి. అమెరికాతో పాటు పలు దేశాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుతో అల్లాడుతున్నాయి. దీనికితోడు చలిగాలుల తీవ్రతతో జనం వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ కోసం అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. మనదేశంలోనూ జమ్మూకశ్మీర్ సహా అనేక ప్రాంతాల్లో చలి ప్రభావం విపరీతంగా ఉంటోంది. మంచు తుఫాన్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి వణికిస్తోంది. చలిగాలుల ప్రభావంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేపటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు. అయితే, మనదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశంలో ఉన్న ప్రజలు ఇంకెలా బతుకుతున్నారో అనే అనుమానం అందరికీ కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశంగా యాకుటియా నగరం నిలిచింది. ఇక్కడ ఏడాది పొడవునా జీరో డిగ్రీలకంటే తక్కువే ఉష్ణోగ్రత నమోదవుతుంది.
యాకుటియా నగరంలో కనురెప్పలు సైతం గడ్డకట్టుకుపోయేంత చలి ఉంటుంది. ఈ నగరం రష్యాలోని యాకుట్స్క్ ప్రావిన్స్‌లో ఉంటుంది. -60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఇక్కడ నమోదవుతూ ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం అత్యంత శీతల నగరంగా రికార్డు సృష్టించింది. ఆదివారం ఈ నగరంలో -51 డిగ్రీలు నమోదైంది. యాకుటియా నగరం రష్యా రాజధాని మాస్కో నగరానికి సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఏడాదంతా అసాధారణ ఉష్ణోగ్రతలే..
అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా నగరమంతా మంచుతో కప్పేసి ఉంటుంది. యాకుట్స్క్ రష్యాకు తూర్పున ఉంటుంది. ఇక్కడ కూడా -40 డిగ్రీల కంటే తక్కువే ఉష్ణోగ్రతలుంటాయి. ఏడాది పొడవునా ఇదే పరిస్థితి. శీతాకాలంలో అయితే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. చలి నుంచి తప్పించుకొనేందుకు ఇక్కడి ప్రజలు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది. అయితే, ఆహార కొరత కూడా ఇక్కడ వేధిస్తోందని ప్రజలు చెబుతున్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 3 లక్షల 55 వేల 443 మంది నివసిస్తున్నట్లు తేలింది. వేసవి కాలంలోనూ మైనస్ డిగ్రీలే ఉంటాయి. తాగునీరు సైతం గడ్డకట్టిపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు.
also read news:
TSPSC group 1 : గ్రూప్ 1 మెయిన్స్‌లో మార్పులు.. ఛాయిస్ తగ్గించేశారు!
Govt Old Vehicles : 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచే అమలు!