World Cup: వరల్డ్ కప్ సమరంకి మరెన్నో రోజులు లేదు. అన్ని జట్లు పోటీకి సిద్ధం అవుతున్నాయి. అక్టోబర్ 16 నుండి టోర్నీ మొదలు కానుండగా, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న జరగనుంది. ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, ఇందులో రత్, పాకిస్థాన్‌తో పాటు మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. టీ20 ప్రపంచకప్ 2022లో తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా మధ్య అక్టోబర్ 16న జరగనుంది. ఇక ఈ వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియాలోని జిలాంగ్‌లోని సిడ్నీ, పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్, బెల్లెరివ్ ఓవల్, కార్డినా పార్క్‌లలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8 జట్లతో పాటు క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత 4 జట్లు సూపర్-12 రౌండ్‌కు చేరుకుంటాయి. నమీబియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు క్వాలిఫయర్ రౌండ్‌లో తమ ప్రతిభని చూపించుకోవలసి ఉంటుంది. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించగా, రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్ A క్వాలిఫయర్ జట్లు..
UAE, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీలంక
గ్రూప్ బి క్వాలిఫయర్ జట్లు..
వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే
సూపర్ 12లో తలపడే జట్లు విషయానికి వస్తే..
గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్,ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్-ఎ క్వాలిఫయర్ విజేత జట్టు, గ్రూప్-బి క్వాలిఫయర్ రన్నరప్
గ్రూప్-బీలో ఇండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బి క్వాలిఫయర్ విజేత జట్లు ఉంటాయి.
ఇక టీ20 ప్రపంచ కప్ 2022 కోసం భారత జట్టు-
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
స్టాండ్‌బైస్ : మహ్మద్ షమీ, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్ గా ఉన్నారు. ఈ సారి రోహిత శర్మ కెప్టెన్సీలో భారత్ అద్భుతం చేయాలని ప్రత ఒక్క అభిమాని కోరుకుంటున్నారు.