Homeviral newsViral Video: డ్యాన్స్ చేస్తూ గోతులో అలా ప‌డిపోయారేంటి.. వైర‌ల్ అవుతున్న దృశ్యాలు

Viral Video: డ్యాన్స్ చేస్తూ గోతులో అలా ప‌డిపోయారేంటి.. వైర‌ల్ అవుతున్న దృశ్యాలు

Telugu Flash News

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వంద‌ల వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో కొన్ని స‌న్నివేశాలు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. అస‌లు అలా ఎలా జ‌రిగింద‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తుంటారు. తాజ‌గా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కోడుతున్న వీడియో చూస్తుంటే, అస‌లు ఎలా ప‌డ్డారు అంటూ నోరెళ్ల‌పెడుతున్నారు. చాలా మంది ఏవైనా పనులు కానీ ఫోటోలు తీసుకోవడం, డాన్స్ చేయడం వంటివి చేసినప్పుడు పరిసరాలను సరిగ్గా గమనించ‌కుండా ప్ర‌మాదాల బారిన ప‌డుతుంటారు.

ఊహించ‌ని విధంగా..

ప‌లుమార్లు బీచ్‌లో లేదా చెరువు వద్ద సెల్ఫీలు తీసుకుంటూ నీటిని గమనించక అందులో పడిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు.తాజాగా మ‌హిళ‌ల గ్రూప్ ఊహించ‌ని విధంగా ఇరకాటంలో ప‌డింది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కొంద‌రు మ‌హిళ‌లు ఈ డాన్స్ చేశారు. కేరింతలు కొడుతూ, పైకీ, కిందకీ జంప్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా.. హఠాత్తుగా కాంక్రీట్ పేవ్‌మెంట్ ముక్కలైపోయి లోపలున్న గొయ్యిలో హ‌ఠాత్తుగా ప‌డ్డారు.

గాబ్రియేలా కార్వాల్హో, 38, బ్రెజిలియన్ న్యూస్ ఔట్లెట్ G1 తో ఇలా చెప్పారు. “నాయనమ్మ ఇంటి దగ్గర డాన్స్ చేస్తున్నప్పుడు ముందు షేక్ అయ్యింది. అయినప్పటికీ దానిని గమనించక డాన్స్ చేసాం” అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొంద‌రు కామెంట్స్ లో వాళ్లందరూ కలిసి దాదాపు 500 కేజీలు ఉంటారు” అని రాయ‌గా, అంత బ‌రువు ఉండడం వ‌ల్ల‌నే కూలింది. “బహుశా వాళ్లంతా గాయపడి ఉండాలి. దీనిపై మీమ్స్ కూడా వచ్చాయి” అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైన ఈ వీడియె చాలా మందిని ఆశ్చర్య‌ప‌రుస్తుండ‌డం విశేషం.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News