మీరు దెయ్యాలకు భయపడేవారా? మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇది మీకే కాదు, ఇలా భావించేవారు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియోలో, ఒక మహిళ Ghost prank తో తల్లిని సరదాగా ఆటపట్టించింది, అయితే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం ఆ తల్లి మాములుగా నిజంగానే ఇటువంటిది ఏదైనా జరిగితే సహజంగా మనం ఎలా భయపడతామో అలానే చేసింది అందుకే నెటిజెన్స్ అందరూ ఈ వీడియోను ఇంతగా వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ లారా అక్టోబర్ 25న షేర్ చేశారు. చిన్న క్లిప్‌లో తల్లి సోఫాలో కూర్చుని టేబుల్‌పై ఉంచిన ల్యాప్‌టాప్‌పై పని చేస్తోంది. వెంటనే ఆమె కార్పెట్ దగ్గర చెక్క నేలపై బాతు బొమ్మ ఉంటుంది. నెమ్మదిగా, బొమ్మ కదలడం ప్రారంభమవుతుంది. అయితే బొమ్మ కదలడంతో వీడియోలోని మహిళ దానిని గమనించడం ప్రారంభించింది. ఇదే కదలిక రెండు మూడు సార్లు చూస్తుంది. ఆ బొమ్మను తదేకంగా చూడటం ప్రారంభించింది అప్పుడే అకస్మాత్తుగా బాతు బొమ్మ వేగంగా కదులుతుంది ఆ తర్వాత దానిని ఎవరో ఫుట్‌బాల్ లాగా తన్నినట్లు ముందుకు పడుతుంది. అది చూసి ఆ మహిళ షాక్‌కు గురై సోఫాలో నుంచి కిందపడింది.
వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
ఈ చిన్న క్లిప్ 12.4 మిలియన్లకు పైగా వీక్షణలను మరియు ఎనిమిది లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోకు “అమ్మపై హాంటెడ్ డక్ ప్రాంక్” అని క్యాప్షన్ ఇచ్చింది లారా.
తల్లిపై దెయ్యం అట ఆడుతున్న మహిళ వీడియోగా వైరల్‌గా అయింది ఈ వీడియో. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్య సమస్యల కారణంగా పెద్దలపై ఇలాంటివి సురక్షితం కాదని కాస్త మందలించారు. ఏది ఏమైనా పెద్ద వయసు వారిలో ఉండే ఆరోగ్య సమస్యల వల్ల ఇటువంటి ఆటలు వారిపై ఆడకపోవటం శ్రేయస్కరం లేదంటే గుండె దడ, బీపీ పెరగడం వంటి సమస్యలకు దారి తీయచ్చు.
also read news:
INDvsENG : భారత్ ఓడిందే మంచిదంటూ కామెంట్స్.. ఫైనల్ చేరి పాకిస్థాన్ చేతిలో ఓడితే మరీ దారుణం..
సమంత నట విశ్వరూపం.. యశోద మూవీ ఎలా ఉందంటే ?