Homewomenస్ఫూర్తినిస్తున్న మహిళా క్యాబ్ డ్రైవర్ కథ..

స్ఫూర్తినిస్తున్న మహిళా క్యాబ్ డ్రైవర్ కథ..

Telugu Flash News

బెంగుళూరుకు చెందిన ఒక మహిళ క్యాబ్ డ్రైవర్ స్ఫూర్తిదాయకమైన కథ ఇంటర్నెట్‌లో బాగా చక్కర్లు కొడుతుంది. బెంగళూరుకు చెందిన నందిని, వ్యాపారవేత్త కావాలని కోరుకుంది. అయితే కోవిడ్-19 రాకతో, ఆమె కల నెరవేరలేదు.

నందిని తను పొదుపు చేసిన సొమ్మును ఉపయోగించి కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించింది, అయితే మహమ్మారి రాకతో ఆమె వ్యాపారం దివాళా తీసింది. కానీ ఆ ఎదురుదెబ్బకు ఆమె కుంగిపోలేదు, తన నష్టాన్ని పూడ్చుకోవడానికి నందిని బెంగళూరులో క్యాబ్ నడపడం ప్రారంభించింది.

ఆమెతో ప్రయాణించిన ఉబెర్ కస్టమర్ ఆమెను అభినందిస్తూ ఆమె కథనాన్ని హైలైట్ చేసారు. కస్టమర్ తన స్నేహితురాలు తన కోసం బుక్ చేసిన ఉబర్ కారు లోపలికి అడుగు పెట్టగానే, ముందు సీట్లో నిద్రిస్తున్నపాపను గమనించారు.

మొదట సందేహించినా తర్వాత ఆ కస్టమర్, పాప గురించి ఆరా తీయగా క్యాబ్ డ్రైవర్ అయిన నందిని ఆ పాప తన కుమార్తె అని, ఆరోజు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లో ఉంచలేక తనతో పాటు పనికి తీసుకువచ్చానని వెల్లడించారు.

రోజుకు 12 గంటలు పని చేస్తూ, తాను పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి నిర్మించేందుకు డబ్బును ఆదా చేయాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పారు ఈ లేడీ క్యాబ్ డ్రైవర్. రైడ్ ముగియడంతో, కస్టమర్ నందిని కలిసి ఒక చిత్రాన్ని క్లిక్ చేసి, ఆమె కథనాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవచ్చా అని అడిగారు.

ఎందుకని ఆమె అడగ్గా, “మేడమ్, మీది చాలా స్ఫూర్తిదాయకమైన కథ, చాలా మంది వైఫల్యం తర్వాత నిరుత్సాహపడతారు, కానీ మీరు గెలిచే వరకు పోరాటం కొనసాగిస్తున్నారు. నేను మీ కథను ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాను “అన్నాడు వెంటనే నందిని అతని అభ్యర్థనను అంగీకరించింది.

-Advertisement-

బెటర్ ఇండియా నివేదించిన నందిని కథనం సోషల్ మీడియాలో  చాలామందికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. లేడీ డ్రైవర్ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ఒక యూజర్ కొనియాడారు.

“ఆమె నిజంగా విశ్వాసానికి చిహ్నం మరియు మా మహిళలకు స్వీయ శక్తి మీద ఆధారపడటం అలవాటే. ఈ ధైర్యవంతురాలిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె విజయాన్ని కోరుకుంటున్నాను మరియు ఆమె కోసం ప్రార్థిస్తున్నాను.” అని మరో మహిళా యూజర్ కామెంట్ చేసారు.

“ఆమె పోరాట పటిమను తెలుసుకుని ఆమె లక్ష్యాన్ని సాధించడానికి దేవుడు ఆమెకు మరింత శక్తిని మరియు తెలివిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

మరి మీకు ఆమె కథ స్ఫూర్తినిచ్చిందా? ఈ సమాజం కేవలం విజయాలనే చూస్తుంది కానీ ఆ విజయం వెనక ఉన్న కృషిని గుర్తించాల్సింది తోటివారే.  అందుకే నందిని తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.

also read :

ఈ వారం పసందైన విందుతో ఓటిటిలు సిద్ధం.. ఏ ఏ సినిమాలంటే ?

చలికాలం లో నిగనిగలాడే చర్మం కోసం… అద్బుతమైన చిట్కా

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News