Heroines: ఒకప్పుడు సినిమా అంటే హీరో, హీరోయిన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దర్శకుడు తన కథకు తగ్గట్టు హీరో, హీరోయిన్స్‌ని సెలక్ట్ చేసుకునేవాడు. పాపులర్ హీరోయిన్ అయితే ఆమె డేట్స్ కోసం కొన్నాళ్ల పాటు వేచి చూసిన పరిస్థితులు కూడా కోకొల్లలు. అయితే ఇటీవలి కాలంలొ చాలా మంంది హీరోలు హీరోయిన్స్ లేకుండానే లాగించేస్తున్నారు. అంతేకాదు మంచి హిట్స్ కూడా అందుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ నటించిన `గాడ్ ఫాదర్` చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ లేదు. ఆ లోటు అభిమానులు ఫీలయినా, సినిమాపై పెద్ద ఇంపాక్ట్ చూపలేదు. అంతకు ముందు నటించిన `ఆచార్య`లో చిరంజీవి సరసన కాజల్‌ని తీసుకున్నా, చివర్లో ఆమెని తొలగించారు
కమల్ హాసన్ నటించిన `విక్రమ్` సినిమా రూ.350కోట్లు వసూలు చేసింది. ఇందులో కమల్ కి జోడీగా హీరోయిన్ లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే హీరోయిన్, గ్లామర్, పాటల అవసరం లేదని నిరూపించిందీ చిత్రం. ఇక లోకేష్ కనగరాజ్ రూపొందించిన `ఖైదీ` చిత్రంలోనూ హీరో కార్తికి హీరోయిన్ లేదు. పైగా ఈ సినిమా కేవలం ఓ రోజు రాత్రి మాత్రమే జరుగుతుంది. తమిళ స్టార్ సూర్య కూడా హీరోయిన్‌తో పనిలేదని `జై భీమ్` చిత్రంతో నిరూపించాడు. ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అత్యధిక రేటింగ్, వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో సూర్యకి జోడీ లేదు. గ్లామర్, పాటలు అసలే లేవు. కానీ సంచలన విజయం అయితే సాధించింది.
మరోవైపు తెలుగులో యంగ్ హీరో నిఖిల్ కూడా అలాంటి సాహసమే చేసి అద్భుతమే సృష్టించాడు. ఆయన నటించిన `కార్తికేయ2`లో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. కానీ ఆమె పాత్ర కీలకంగానే ఉంటుంది, ఎక్కడ రొమాన్స్, ఆమెతో పాటలకుగానూ స్కోప్ లేదు. ఓ రకంగా నిఖిల్‌కి హీరోయిన్ లేదు. అలాగే ఇప్పుడు `స్పై` చిత్రంలో నటిస్తున్నారు నిఖిల్. ఇందులోనూ ఆయనకు జోడీ లేదని, గ్లామర్‌కి స్కోప్ లేదని తెలుస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరో సుధీర్‌బాబు `హంట్` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సుధీర్‌బాబుకి హీరోయిన్ లేదు. గ్లామర్ ఎలిమెంట్లు లేవు. వరుణ్ తేజ్ కూడా అలాంటి సాహసమే చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న `గాండీవధారి అర్జున` చిత్రాన్ని రెండు రోజుల క్రితమే ప్రకటించారు ఇందులోను హీరోయిన్ లేదు.చూస్తుంటే రానున్న రోజులలో మరిన్ని సినిమాలు హీరోయిన్లు లేకుండానే రాబోతున్నట్టు తెలుస్తుంది.