ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ (TRS) ను బిఆర్ఎస్ (BRS) అంటూ జాతీయ పార్టీగా మార్చడంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) అన్ని విధాలుగా సిద్ధమౌతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ముందుగా ఏపీపై తన అధికారాన్ని నిలపాలని ప్రయత్నిస్తుండడంతో ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో కూడా తన రాజ్యాన్ని నిలపాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇటీవలే బీసీ వర్గానికి చెందిన తోట చంద్రేఖర్ (THOTA CHANDRASEKHAR) ను ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి అద్యక్షుని గా నియమించారు. అలా ఆయనను నియమించడం ద్వారా ఏపీ రాజకీయాలలోకి తొలి సారిగా అడుగుపెట్టనున్నారు.
అయితే ఇక్కడ అందరి మనసుల్లో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే ఇంతలా సిద్ధమౌతున్న కేసీఆర్ నిజంగా ఏపీ ప్రజలను తన వైపు తిప్పుకోగలడా? ఏపీ ప్రజలు కేసీఆర్ ను స్వాగతిస్తారా? అని. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే అసలు కేసీఆర్ ఏపీకి ఇంత వరకూ ఏం చేశాడో తెలియాలి.
ఏపీ, టిఎస్ విభజన జరిగి ఇప్పటికి దాదాపుగా 8 ఏళ్లు అవుతుంది. కాగా విభజన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చాలా మీటింగ్ లలో, చాలా సార్లు ఏపీ, టిఎస్ విభజనకు తానే కారణమని డప్పులు కొట్టుకుంటూ చెప్పుకున్నారు. అయితే అసలు ఈ విభజన అంటే ఇష్టం లేని ఏపీ ప్రజలు దీనికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆచూకీ లేకుండా తరిమేశారు.
దీనికి తోడు విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (ANDHRA PRADESH STATE) లోటు బడ్జెట్ రాష్ట్రంగా అష్టకష్టాలు పడుతుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య జల వివాదాలకు ఇంకా పరిష్కారం దొరకలేదు. విభజన పంచాయతీలు కూడా అలాగే ఉన్నాయి.
ఇవే కాక ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి. 9,10 షెడ్యూల్ లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు వంటి విషయాలలో ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇలా ఇన్ని అంశాలపై ఇంకా స్పష్టత రాక ముందే ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పార్టీని నిలబెట్టాలనుకోవడం, ఏపీని పాలించాలి అనుకోవడంపై రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
కేసీఆర్ వచ్చి నాలుగు మాటలు చెప్తే ప్రజలు ఆయనను స్వాగతిస్తారా? బిఆర్ఎస్ పార్టీ ఏపీలో నిలుస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది.
also read:
Cricketers: చిన్న పిల్లల్లా మారిన టీమిండియా క్రికెటర్స్.. ముద్దొచ్చేస్తున్నారుగా…!
US Visa : అమెరికా వీసాలపై సంచలన నిర్ణయం.. భారీగా ఫీజులు పెంచేసిన బైడెన్ ప్రభుత్వం!
Divorce: కొత్త సంవత్సరంలో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. అవాక్కవుతున్న అభిమానులు