Homenationalభార్యపై ఫిర్యాదు చేసిన భర్త.. పోలీసులకే దిమ్మ తిరిగింది!

భార్యపై ఫిర్యాదు చేసిన భర్త.. పోలీసులకే దిమ్మ తిరిగింది!

Telugu Flash News

సాధారణంగా గృహ హింస కేసులు ఆడవాళ్లు పెడుతుంటారు. భర్తల చేతుల్లో చిత్ర హింసలకు గురవుతున్న భార్యలు.. వాటిని భరించలేక పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ.. కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంటారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్‌ కాస్త మారుతున్నట్లుగా ఉంది. భార్యల వేధింపులు తాళలేని కొందరు భర్తలు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం గమనార్హం. భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందని, పట్టించుకోవడం లేదంటూ భర్తలు ఠాణాలను ఆశ్రయిస్తున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఐటీ సిటీగా పేరు గాంచిన బెంగళూరులో చోటు చేసుకుంది.

తన భార్య తనను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఓ భర్త పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చాడు. ఆ ఫిర్యాదును చూసిన ఖాకీలకు దిమ్మతిరిగిపోయింది. ఇందేం ఫిర్యాదంటూ కాస్త ఆలోచనలో పడిపోయారు. అనంతరం ఆ బాధిత భర్త చెప్పిన విషయాలను విని షాక్‌కు గురయ్యారు. బెంగళూరులోని బసవగూడకు చెందిన కమ్రాన్‌ ఖాన్‌కు ఆయేషాతో పెళ్లి జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని, ఎక్కువ టైమ్‌ నిద్రపోవడానికే ఆమె ప్రాధాన్యం ఇస్తోందని వాపోయాడు. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తే మిట్ట మధ్యాహ్నం 12.30 గంటల దాకా నిద్రలేవదని చెప్పాడు.

ఉదయం నిద్ర లేపాలని ప్రయత్నిస్తే తనను దూషిస్తోందని చెప్పాడు. మధ్యాహ్నం పడుకుంటే రాత్రి తొమ్మిదిన్నర వరకు పడుకొనే ఉంటుందని ఆవేదన చెందాడు. ఇలా నిద్రపోవడానికే జీవించే వాళ్లు పెళ్లి ఎందుకు చేసుకుంటారో అర్థం కావడం లేదన్నాడు. ఇక ఇంట్లో తన వైఫ్‌ ఏ పనీ చేయదని, తన తల్లి వంట పని చేసి ఇల్లు శుభ్రం చేస్తుందన్నాడు. పని చేయడమంటే ఆమెకు చిరాకు వస్తుందని, తిట్టడం లాంటివి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లికి వృద్ధాప్యం వస్తోందని, ఆమెను కూడా సరిగా చూసుకోలేకపోతోందని చెప్పాడు. ఇప్పటి దాకా ఆమె చేష్టలు భరించానని, ఇటీవల తన భార్య తన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేయడం మొదలు పెట్టిందన్నాడు.

తన భార్యను ఇకపై భరించడం తన వల్ల కాదని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమ్రాన్‌ ఖాన్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మామ ఆరిఫుల్లా, అత్త హీనా కౌసర్‌ పేర్లను కూడా పోలీసులు ఇంక్లూడ్‌ చేశారు. ఇదే తరహాలో గతేడాది కర్ణాటకలోనే మైసూరులో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న గోల్డ్‌ దొంగిలించి వేధింపులకు గురి చేస్తోందంటూ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త.

also read :

అదానీ ఇంట్లో పెళ్లి సందడి.. కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం.. కోడలు ఎవరంటే..

-Advertisement-

Health Tips (14-03-2023) : ఈ 10 ఆరోగ్య చిట్కాలు.. మీ కోసం..

moral stories in telugu : ఇద్దరు అన్నదమ్ముల కథ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News