Telugu Flash News

Curd: వేసవిలో రోజూ పెరుగు తీసుకోరాదట.. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది!

Curd: వేసవి కాలంలో చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భోజనం తినే సమయంలో పెరుగు వాడుతుంటారు. వేసవిలో పెరుగు చల్లదనం ఇస్తుందని చెబుతారు. పొట్ట ఆరోగ్యం కోసం చల్లగా పెరుగు తినాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

పెరుగులో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ పెరుగు తిన్న తర్వాత కొంతమందికి మొటిమలు, చర్మ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో అధిక వేడిగా అనిపించడం చూస్తుంటాం.

పెరుగులో వేడి చేసే లక్షణాలు కంటే శీతలీకరణ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం, ప్రాచీన భారతీయ వైద్య విధానం ప్రకారం వేసవిలో పెరుగు తీసుకోవడంతో మన బాడీపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయట.

పెరుగుని వేసవిలో రోజూ తినరాదని నిపుణులు చెబుతున్నారు. రాళ్ల ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులు జోడించుకుని మజ్జిగ రూపంలో మాత్రమే రోజూ తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని స్పష్టం చేస్తున్నారు. పెరుగులో నీటిని కలిపినప్పుడు అది వేడి ప్రభావాలను సమతుల్యం చేస్తుందని, నీరు వేడిని తగ్గిస్తుందని చెబుతున్నారు.

Read Also : Devotional: శంఖం సంపదకు ప్రతిరూపం.. ఎలా పూజించాలంటే..

Exit mobile version