HomecinemaAcharya: ఆచార్య ఫ్లాప్ వెన‌క ఆశ్చ‌ర్య‌పోయే నిజం.. ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో మణిశర్మ

Acharya: ఆచార్య ఫ్లాప్ వెన‌క ఆశ్చ‌ర్య‌పోయే నిజం.. ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో మణిశర్మ

Telugu Flash News

Acharya: చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ఆచార్య‌. ఈ చిత్రం భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చి దారుణ‌మైన ఫ్లాప్ చవిచూసింది. సినిమా విడుదలై చాలా రోజులే అవుతున్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ జ్ఞ‌పకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి..

చిరంజీవి ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్ ప్రాణం పోసిన మణిశర్మకు కూడా ‘ఆచార్య’ ఒక మరక గా మిగిలింద ఈ సినిమాకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అస్సలు బాగాలేదని.. ఆయన స్థాయిలో లేదని విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ విమర్శలపై తాజ‌గా మణిశర్మ స్పందించారు.

‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో అతిథిగా పాల్గొన్న మణిశర్మ.. ‘ఆచార్య’ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుతూ.. లాహే లాహే, బంజారా పాటలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పిన మణిశర్మ.. తాను అందించిన బీజీఎంకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు.

చిరంజీవి గారి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చినవాడిని నేను, ఆయనకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఒక వర్షన్ చేశాను. కాని డైరెక్టర్ గారు వచ్చి.. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది వద్దు, వేరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని అన్నారు . దాంతో నేను కొత్త‌గా చేయ‌క త‌ప్ప‌లేదు.

దర్శకత్వం విషయం లో కూడా చిరంజీవి కి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లోనే చాలా సన్నివేశాల్లో తేడా కొట్టిందట.. అయితే మనం 2022 వ సంవత్సరం లో ఉన్నాము..ఇప్పటి ఆడియన్స్ కి ఇలాంటి సన్నివేశాలు నచ్చుతాయా ? అని చిరంజీవి అడిగేవార‌ట‌.

కాని కొర‌టాల న‌న్ను న‌మ్మండి అంటూ ప‌ని కానిచ్చేయ‌డంతో తేడా కొట్టింది. అయితే సినిమా ఫ్లాప్ విష‌యంలో ఎక్కువ మంది కొర‌టాల‌ని త‌ప్పుప‌డుతుండ‌గా, మెగాస్టార్ చిరంజీవి సైతం ‘ఆచార్య’ పరాజయానికి డైరెక్టర్‌నే పరోక్షంగా తప్పుబట్టారు. చాలా సందర్భాల్లో, పలు వేదికలపై డైరెక్టర్‌ను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. కొరటాల శివను బలిపశువును చేశారని విమర్శలు సైతం వ‌చ్చాయి.

-Advertisement-

also read news: 

Cricketers: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు క్రికెట‌ర్స్.. అదీ సిరీస్ మ‌ధ్య‌లో…!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News