HomenationalJoshimath sinking : జోషిమఠ్‌ మునిగిపోతుందా..? చరిత్రలో మరో ద్వారకా అవుతుందా..?

Joshimath sinking : జోషిమఠ్‌ మునిగిపోతుందా..? చరిత్రలో మరో ద్వారకా అవుతుందా..?

Telugu Flash News

Joshimath sinking : నిత్యం బద్రీనాథ్ ,ఔలి, హెంకుండ్ సాహిబ్ లాంటి గొప్ప గొప్ప అందాలకు కొలువైన ప్రదేశాలకు వెళ్ళే పర్యాటకులతో కళకళ లాడుతూ ఉండే ఉత్తరాఖండ్ లోని పట్టణం జోషిమఠ్‌. అయితే ఇప్పుడు ఇది ప్రమాదంలో ఉందట.రేపో మాపో మునిగిపోయే పరిస్థితికి చేరుకుందట.అసలు ఈ పట్టణానికి ఏమైంది?మునిగి పోయేంత స్థాయికి ఎలా వచ్చింది తెలియాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే ఉత్తరాఖండ్‌లోని ఈ జోషిమఠ్‌లో హఠాత్తుగా ఇళ్ల గోడలపై,రోడ్లపై పగుళ్లు వచ్చాయి. ఇదే కాకుండా సింగ్‌ధార్ వార్డులోని ఒక శివాలయం ఉన్నటుండి కుప్ప కూలిపోవడంతో స్థానికులలో గాబరా మొదలైంది. ఏ క్షణం ఏ ఇల్లు కూలిపోతుందోనని బిక్కు బిక్కు మంటూ బతకడం వారి జీవితం అయ్యింది.

కాగా ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ..ప్రజలలో ఈ అనుకోని పరిణామాల వల్ల ఆందోళన మొదలైంది. ప్రజలలో కంగారును గమనించిన ప్రభుత్వం కొంతమంది నిపుణులతో సర్వే చేయించగా వాళ్ళ భయం నిజమేనని తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.


ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టమని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు ఇప్పటికే 50 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించగా…ఇంకా 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తున్నారు.

ప్రజలకు నిత్యం వైద్య సేవలను అందుబాటులో ఉంచమని ఆధికారులు చెప్పారు. అదే విధంగా జోషిమఠ్‌ ను దగ్గరగా గమనిస్తున్నానని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వనని ఆయన తెలిపారు.
అయితే 1976 లోనే ఇప్పుడు ఈ పట్టణం ఉంటున్న ప్రదేశంలో హద్దులు దాటి బిల్డింగ్ లు కడితే తరువాత ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.


ఇప్పుడు మరో సారి సర్వే చేయగా ఇక్కడ ప్రవహిస్తున్న విష్ణుప్రయాగ్ ప్రవాహం,ఈ పట్టణం కట్ట బడిన ప్రదేశం ఇవి రెండూ ఇలా రోడ్లపై, ఇళ్ల గోడలపై గీట్లు పడడానికి,అవి కూలిపోవడానికి కారణమని తేలింది. అదే విధంగా ఇక్కడ ఒక నిర్ధిష్టమైన డ్రైనేజ్ (drainage) సిస్టమ్ లేదని, ఇది కూడా ఇందులో ఒక కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తూ, వారికి అన్ని విధాలా సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం జాగ్రతలు తీసుకుంటుండగా… ఈ జోషిమఠ్‌ పట్టణం నేలపై నిలుస్తుందా..? లేక మునిగిపోయి మరో ద్వారకగా మారుతుందా?ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం ఇస్తుంది.

-Advertisement-

also read:

TRS MLAs poaching case : హైకోర్టులో ఎరకేసు వాదనలో హై డ్రామా… 

David Warner: రిటైర్మెంట్ ఆలోచ‌న‌లో డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాల్లోకి రాబోతున్నాడా..!

Vijay Devarakonda Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక జంట‌పై క్రేజీ రూమ‌ర్స్.. నిక్‌నేమ్ కూడా పెట్టేశారుగా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News