ప్రముఖ రచయిత్రి , తత్వవేత్త , UK ప్రధాని రిషి సునాక్ అత్తగారు ప్రముఖ ప్రపంచ IT దిగజ్జ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి మహారాష్ట్ర , సాంగ్లీ జిల్లాలో జరిగిన తన పుస్తకాల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆవిడ ప్రముఖ హిందువాది మూర్తి రైట్ వింగ్ నాయకుడు శంభాజీ భిడే పాదాలను తాకిన వీడియో వైరల్ గ మారిన తర్వాత వివాదానికి కేంద్రంగా నిలిచింది.
బొట్టు పెట్టుకోలేదని జర్నలిస్టుతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు శంభాజీ భిడే ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ఘటనపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన తరువాత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి భార్య సుధా మూర్తి శంభాజీ భిడే యొక్క పాదాలను తాకిన వీడియో సాంగ్లీ నుండి వచ్చింది. UK యొక్క కొత్త ప్రధాన మంత్రి రిషి సునక్ యొక్క అత్తగారు మర్యాదను చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోతూ ఈ వీడియో ను వైరల్ చేసారు.
Women of substance Sudha Murthy..!
Mother in law of UK Prime Minister @RishiSunak and wife of Infosys founder Naryan Murthy; Sudha Murthy ji took the blessings of Hindutva activist Sambhaji Bhide (Bhide Guru ji) in Sangli yesterday. pic.twitter.com/c99ijq0SDK
— Sameet Thakkar (@thakkar_sameet) November 8, 2022
దీని పై స్పందించిన సుధామూర్తి , శంభాజీ భిడే ఎవరో తెలియదని, సీనియర్ వ్యక్తి పట్ల గౌరవంతో నమస్కరించానని సుధా మూర్తి సహాయకుడు పిటిఐకి తెలిపారు .
శంభాజీ భిడేను కలవాలని సుధా మూర్తిని ‘ఒత్తిడి’ చేశారని కొన్ని ఖాతాలు ద్వారా వెలువడిన సమాచారం తర్వాత భారీ వివాదం మొదలైంది. సాంగ్లీ ఈవెంట్ను నిర్వహించిన మెహతా పబ్లిషింగ్ హౌస్ ఎడిటోరియల్ హెడ్ యోజన యాదవ్ ఫేస్బుక్ పోస్ట్ లో ఈ సమాచారం ,వీడియో కనిపించడంతో వైరల్ అయ్యింది.
పోలీసుల ఒత్తిడి మేరకు సుధా మూర్తి శంభాజీ భిడేను కలిశారని యోజన యాదవ్ తన పోస్ట్లో పేర్కొన్నారు. శంభాజీ భిడే మరియు అతని మద్దతుదారులు ఎటువంటి ఆహ్వానం లేకుండా కార్యక్రమానికి వచ్చారు. అయితే రైట్ వింగ్ నాయకుడి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆడిటోరియం వెలుపల వేచి ఉండటంతో భిడేని కలవాల్సిందిగా పోలీసులు మూర్తిని అభ్యర్థించారు.
ఒత్తిడి ఎంతగా ఉందంటే, విసిగిన సుధా మూర్తి తన పాఠకులతో సంభాషించడం మానేసి, భిడేని కలవడానికి బయలుదేరింది. ఆమెకు భిడే ఎవరో తెలియదు, కాబట్టి ఆమె అతని వయస్సు పై గౌరవంతో అలాచేసి ఉంటారని యోజన PTIకి తెలిపింది.
also read this news:
ఇంటర్నెట్ కంటే మెటావర్స్ సురక్షితమా ? కాదా? నిపుణుల మాటేంటి?
గ్రీన్ టిక్ ఫ్రీగా ఇస్తాం రండి.. కొత్త యూజర్స్ కోసం Koo అన్వేషణ!!