ప్రపంచ దేశాల COP27 సమావేశం కొనసాగుతున్న సమయం లో సమావేశం మధ్యలోనుంచి నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) వెళ్లిపోవడం ఇప్పుడు ప్రపంచమంతట చర్చనీయాంశంగా మారింది . దీనికి సంబందించిన వీడియో కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది .
ఏం జరిగింది ?
బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం తన సహాయకులు COP27 సమ్మిట్ యొక్క కొనసాగుతున్న సెషన్ నుండి నాటకీయంగా బయటకి వెళ్లిపోయారు . ఏం జరిగిందో తెలియక వివిధ దేశాల సభ్యులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటన యొక్క వీడియోను UK ఆధారిత వెబ్‌సైట్ కార్బన్ బ్రీఫ్ డైరెక్టర్ – లియో హిక్‌మాన్ షేర్ చేశారు.
UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX
— Leo Hickman (@LeoHickman) November 7, 2022
“UK ప్రధాన మంత్రి రిషి సునక్ COP27లో అటవీ పరిరక్షణ అనే అంశం పై సభ నడుస్తున్న సమయం లో అయన బయటకు వెళ్లిపోయారు .
COP27 సమ్మిట్ అంటే ఏమిటి ?
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, సాధారణంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – లేదా COP27 అని పిలుస్తారు – ఆదివారం ఈజిప్షియన్ రిసార్ట్ టౌన్ షర్మ్ ఎల్-షేక్‌లో ప్రారంభించబడింది.
2022 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, సాధారణంగా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఆఫ్ ది UNFCCC లేదా COP27 అని పిలుస్తారు, ఇది 27వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం మరియు 6 నవంబర్ నుండి 18 నవంబర్ 2022 వరకు ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో జరుగుతుంది.
ప్రధానమంత్రి అయిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ సదసు లో మాట్లాడిన రిషి సునాక్ , వాతావరణ మార్పులను కారణమైన సమస్యలను పరిష్కరించడంలో నిర్ణయాలు వేగంగ తీసుకోవాలని తద్వారా రేపటి తరానికి పచ్చని దేశాన్ని అందించగలమని అయన అన్నారు .
గ్లాస్గో ఇంపాక్ట్ ఒడంబడికలో చేసిన వాగ్దానాలను గౌరవించాలని మరియు భూమి యొక్క రక్షణ కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫైనాన్స్‌ను మళ్లించాలని సునాక్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇంధన భద్రత, హరిత సాంకేతికత మరియు ఇతర పర్యావరణ సంబంధిత విధానాలపై కొత్త భాగస్వామ్యాలను చర్చించడానికి UK ప్రధాన మంత్రి తన తోటి ప్రపంచ నాయకులతో అనేక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.
also read:
ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ పై భారతదేశపు మొట్టమొదటి ట్విట్టర్ యూజర్ నైనా రెధు ఏమన్నారో తెలుసా?