Telugu Flash News

Thota Chandrasekhar : తోట చంద్రశేఖర్ ఎవరు ? బీఆర్ఎస్‌ కి ఇతని రాక..జనసేనకి శాపంగా మారుతుందా ?

thota chandrasekhar with cm kcr

తెరాసని జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో 2022, అక్టోబర్ 5 న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీని బీఆర్ఎస్‌(భారత్ రాష్ట్ర సమితి)గా మార్చారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవలే కేసీఆర్,  మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) ను జనవరి 2, 2023 న బీఆర్ఎస్‌ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించడంతో అసలు ఈ తోట చంద్రశేఖర్ ఎవరు అంటూ ఆరాలు మొదలయ్యాయి.

2008 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి Aditya Housing & Infrastructure Development కు చైర్మన్ గా  చేస్తూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తోట చంద్రశేఖర్.

ఆ తరువాత మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో ముఖ్య పాత్ర పోషించారని, పార్టీకి కావాల్సిన కార్యాలయాన్ని కూడా ఇచ్చారని చెబుతారు.

2014 లో వైఎస్ఆర్సిపీ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేయగా పరాజయాన్ని పొందారు. 2019లో గుంటూరు పచ్చిమ నియోజకవర్గం ఎమ్.ఎల్.ఏగా పోటీ చేసినప్పటికీ ఈ సారి కూడా గెలవలేకపోయారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఈ పార్టీలోకి మారి మరో సారి మెగా బ్రదర్ చెంతకే వచ్చి చేరారు. అప్పటి నుంచి పార్టీలో తోట చంద్రశేఖర్ కూడా ఒక కీలకనాయకుడిగా మారిపోయారు.

దీంతో అప్పుడు చిరంజీవికి, ఇప్పుడు పవన్ కి వెన్నెముకగా మారిన తోట చంద్రశేఖర్ మెగా బ్రదర్స్ కి సన్నిహితుడని ప్రజలు అనుకోవడం మొదలు పెట్టారు.





అయితే ప్రస్తుతం జనసేన పార్టీలో పవన్ తరువాత రెండోవ స్థానంలో ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్న నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ లాంటి అనుభవం ఉన్న నాయకుల మాటలకు కూడా విలువ ఇవ్వట్లేదని, పార్టీని పక్క దారి పట్టిస్తూ….టీడీపీ తో కలిసే వైపుగా అడుగు వేయిస్తున్నారని అందుకే తోట చంద్రశేఖర్ పార్టీ నుంచి బయటకి వచ్చేశారని ప్రజలలోను,నాయకుల మధ్య టాక్ నడుస్తుంది.

దీని వల్లే తోట చంద్రశేఖర్ పార్టీ బయటకు వచ్చారు గానీ.. పవన్ కి ఇంకా ఆయన సన్నిహితుడేనని పార్టీ వాళ్ళు,ప్రజలు అనుకుంటున్నారు.

ఇక బీఆర్ఎస్‌ కి చంద్రశేఖర్ రాక జనసేనకి శాపంగా మారబోతుందనీ… ఆయనకి ఉభయ గోదావరి జిల్లాలలో నేతలతో పరిచయాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది నాయకులను బీఆర్ఎస్‌ కి తీసుకువెళ్లిపోతారనీ.. దీంతో జనసేన పార్టీలో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

also read :

Viral Video : న్యూయార్క్‌ వీధుల్లో డోలారే డోలా.. ఇండియన్‌ యూట్యూబర్‌తో కలిసి కెనడియన్‌ అదిరిపోయే డ్యాన్స్‌

Daily exercise : వ్యాయామం ఆరోగ్యానికి ఆయువుపట్టు

 

Exit mobile version