ఉక్రెయిన్ యుద్ధంలో గెలవాలి అంటే రష్యా చేజిక్కించుకున్న ఉక్రెయిన్ ప్రావిన్స్ లోని క్రిమియా (Crimea) ను మళ్ళీ ఉక్రెయిన్ సొంతం కావాలి. అసలీ క్రిమియాకు ఎందుకింత ప్రాధాన్యత. తెలియాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే.
రష్యాకి,ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం మొదలై ఇప్పటికీ దాదాపుగా ఏడాది కావస్తుంది.ఈ ఏడాదిలో ఉక్రెయిన్ కొన్ని విషాధకర సంఘటనలు ఎదుర్కొన్నప్పటికీ ఆ దేశానికి జరిగిన కొన్ని మంచి సంఘటనలు ఉన్నాయి.
గతేడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోడానికి 1,90,000 ట్రూపులతో దాడికి దిగింది. దీనికి ఫలితం వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దేశం విధ్వంసాన్ని చూసింది. కానీ అదృష్టవశాత్తు దాడి జరిగిన కొన్ని వారాలకే రష్యా దాడిని ఉక్రెయిన్ తిప్పి కొట్టగలిగింది.
ఆగస్టు నాటికి రష్యా చేజికించుకున్న కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి సమర్థవంతంగా మళ్ళీ తన సొంతం చేసుకుంది.ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడం అనుకున్నంత సులభం కాదని రష్యాకు తెలిసేలా చేసింది.రష్యా ఆసలు ఆవిరి చేసింది.
రష్యా దుష్ప్రచారం
ఒక పక్క ఉక్రెయిన్ రష్యాను తిప్పికొడితే, మరో పక్క రష్యా మాత్రం ప్రపంచానికి బడాయి కబుర్లు చెప్పింది. వీలైనంత వరకు నిజాన్ని బయటకు రానివ్వకుండా కప్పేసే ప్రయత్నం చేసింది. ఉక్రెయిన్ కి సంబంధించిన నాలుగు ప్రావిన్సులు ఖెర్సాన్, జపొరిజియాలను,లుహాన్స్,డొనెట్స్ లను తాము స్వాధీనం చేసుకున్నామని గత ఏడాది సెప్టెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.కానీ దీంట్లో ఏ మాత్రం నిజం లేదు.
పుతిన్ ఈ ప్రకటన చేసే సమయానికి వీటిలో ఏ ఒక్క ప్రావిన్స్ కూడా ఆ దేశం చేతుల్లో లేదు. ఇంకా చెప్పాలంటే సైన్యం దాదాపుగా అక్కడ పట్టు కోల్పోయింది. ఉక్రెయిన్ ప్రావిన్స్ కి చెందిన క్రిమియా ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉంది.
రష్యా అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించి,2014లో ఆ దేశాన్ని తమ సొంతం చేసుకుంది. 1954లో క్రిమియాను ఉక్రెయిన్ కు బదలాయించటం తప్పని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా చేసిన తప్పును దిద్దుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
క్రిమియాను తిరిగి దక్కించుకోవటం వల్ల అంతర్జాతీయంగా కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నామని ఆయన ప్రగల్బాలు పలికారు. కానీ దీంట్లో కూడా ఎంతమాత్రం నిజం లేదు.
క్రిమియాకు విశిష్టమైన చరిత్ర ఉంది.
ఎంతో కాలంగా అది రష్యాలో భాగంగా ఉన్న మాట కూడా నిజమే అయినప్పటికీ, 1991లో దేశవ్యాప్తంగా చేపట్టిన రిఫరెండంలో ఉక్రెయిన్లు అందులో అధికభాగం క్రిమియన్ లో నివసిస్తున్న వాళ్లంతా సోవియెట్ యూనియన్ నుంచి విముక్తం కావాలని కోరారు. వాళ్లంతా అలా కోరుకోవటానికి కారణమూ లేకపోలేదు.
రష్యా నిరంకుశ రాజ్యం కాగా.. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తోంది. రష్యా పాలనలో క్రిమియాలో నియంతృత్వం కొనసాగుతుంది. మైనార్టీల అణచివేత, పౌరులను దుష్ప్రచారం చేసే మీడియాకు లోబడి ఉండాలని ఒత్తిడి కొనసాగుతోంది.దీంతో వేలాది మంది క్రిమియన్ టాటర్ జాతుల వాళ్లు రష్యా ఆక్రమణలో నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.
పశ్చిమదేశాలు కూడా ఇదే ఏకాభిప్రాయంతో ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆధీనంలోకి తెచ్చుకోవటం అనేది సరైన నిర్ణయం కాదనే విషయంలో పశ్చిమదేశాలు కూడా ఏకీవభించాయి. కానీ వారి అభిప్రాయలు మాటల దగ్గరే ఆగిపోయాయి. క్రిమీయాను రష్యా నుంచి విముక్తి చేయడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు.
క్రిమియాను ఉక్రెయిన్ లో కలిపేందుకు ప్రయత్నాలు చేసి రష్యాను రెచ్చగొడితే, పుతిన్ న్యూక్లియర్ యుద్ధానికయినా వెనకాడడూ అన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ భయాందోళనలను గురవుతున్నారు.
క్రిమియాను ఉక్రెయిన్ లో సంఘటితం చేసుకోవడానికి అవి సహాయం చేయకపోగా.. క్రిమియాను పొందటానికి తన రాజధాని కివీని రష్యాకు అందించేందుకు ప్రతిపాదనలు చేసుకోవచ్చని సలహాలిస్తున్నాయి.
అసలు ఈ క్రిమియాకు అంత ప్రాధాన్యత ఎందుకు?
దీనికి దక్షిణ తీరంలో అంతా విలాసవంతమైన చారిత్రక రాజప్రాసాదాలు ఉండగా.. 1783లో రష్యా స్వాధీనం చేసుకునేవరకూ దానిని ఎందరో రాజులు పాలించారు. ఇక్కడ ఎన్నో జాతులు ఉన్నాయి.
ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవటానికి రష్యా ఈ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మలుచుకుంది.
20 లక్షల మంది పౌరుల్లో 2014 తర్వాత దాదాపు ఏడులక్షల మంది అక్కడకు మకాం మార్చారు.
ఉక్రెయిన్ నుంచి క్రిమియాను లాక్కోవటానికి రష్యాకు ఎనిమిదేళ్లు పట్టింది. అక్కడ తగినంత మంది సైనిక పటాలాన్ని ఉంచింది.
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంలో రష్యా ఈ భూభాగాన్ని వినియోగించుకుంటోంది. క్రిమియన్ లో ఉన్న బ్లాక్ సీ నావికాదళాన్ని ఉపయోగించుకుంటోంది. అలాగే ఇక్కడ ఎయిర్ బేస్ నుంచి డ్రోన్,మిస్సెల్ దాడులను నిర్వహిస్తోంది.
రష్యా దీన్ని ఆక్రమించుకోవటం ద్వారా ఇటు బ్లాక్ సీ, అటు అజోవ్ సీల పైన పట్టు సాధించింది. యురేషియన్ ఖండం రవాణాకు అది సముద్ర మార్గం. సీపోర్టులను, రవాణాలను లను అది నియంత్రించగలుగుతోంది.ఇనుపఖనిజం,బొగ్గు ఇక్కడ నుంచే రవణా అవుతున్నాయి.
క్రిమియాను స్వాధీనం చేసుకుంటేగానీ ఉక్రెయిన్ సురక్షితంగా ఉండదు. అదే విధంగా తన ఎకానమీని పునరుద్ధరించుకోలేదు. 2018లో అజోవ్ సీ పైన రష్యా పట్టు సాధించినప్పటి నుంచి ఉక్రెయిన్ కి చెందిన మరియుపోల్, బెర్డియాన్స్ కో ఎయిర్ పోర్టులలో రవాణా తగ్గింది.
నల్ల సముద్రంలో అనేక సహజ వాయువు వనరులను సొంతం చేసుకోవడానికి ఉక్రెయిన్ ప్రయత్నించింది. ఎక్సాన్ మొబిల్తో ఆరు బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇప్పుడు రష్యా ఆక్రమణతో అది కాస్త చేజారిపోయింది. క్రిమియా రష్యా చేతిలో ఉన్నంత కాలం ఆ దేశంపై పైచేయి సాధించడం అసాధ్యం.
also read:
Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యం ఎలా ఉంది..ఐపీఎల్లో ఆడతాడా లేదా అనే దానిపై అప్డేట్ ఇచ్చిన గంగూలీ
జైల్లో పాడిన పాట.. తన జీవితాన్నే మార్చేసింది.. ఈ స్టొరీ చదవండి !