Heart Attack : ఇటీవల గుండెపోట్లు, సంబంధిత మరణాలు అధికంగా నమోదవుతుండడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. మనం తీసుకొనే ఆహారంలో సోడియం (సాల్ట్) మోతాదు ఎక్కువ కావడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు సంబంధిత మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆ నివేదికలో స్పష్టమైంది.
ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈ తరహా నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి. వరల్డ్ వైడ్ సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారి తప్పుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ఉప్పు ఒకటి. అయితే, దాన్ని తగిన మోతాదు కంటే అధికంగా వినియోగం చేయడం వల్ల గుండె సంబంధిత జబ్బులు, స్ట్రోక్స్, పలు రకాల మరణాల ముప్పు అధికమవుతోందని నివేదికలో వెల్లడైంది.
ఓ టేబుల్ స్పూను ఉప్పులో సోడియం మోస్తరుగా లభ్యమవుతుంది. వంటల్లో వేసే మసాలాల్లో కూడా ఈ పోషకం అధికంగానే ఉంటుంది. అయితే, డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు పద్ధతులను సరిగా అమలు చేస్తే 2023 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడే చాన్స్ ఉందని తేలింది. ఇప్పటికి కేవలం బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే.. ఈ తొమ్మిది దేశాలు మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడంలో భాగంగా డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయని తేలింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారని తేలింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువేనని వెల్లడైంది. ఈ నేపథ్యంలో మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాలు సోడియం తగ్గతించే పద్ధతులను అనుసరించడం లేదని ఈ నివేదిక పేర్కొనడం గమనార్హం. దీంతో ఆయా దేశాల్లో ప్రజలకు గుండెపోటు, పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తేలింది. సోడియం వాడకం తగ్గించేందుకు బెస్ట్ బైస్‌ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకూ సూచించింది.
also read :
Tammareddy Bharadwaj: అసహ్యంగా ఉంది.. ఇలా మాట్లాడతారా? తనకు సంస్కారం ఉందన్న తమ్మారెడ్డి
RRR: విషం కక్కిన తమ్మారెడ్డికి నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్స్
RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.. సంచలనంగా మారిన కామెంట్స్