చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) సారథి ధోనీ (dhoni) ఎందుకు బెస్ట్ కెప్టెన్ అన్నది తాజాగా ఐపీఎల్ (IPL 2023) కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు (ambati rayudu) మాటల రూపంలో మరోసారి చూడొచ్చు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఇదే తన చివరి మ్యాచ్ అని, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అంబటి రాయుడు ప్రకటించాడు.
ఐపీఎల్ సిరీస్ ను చెన్నై గెలుచుకోవడంతో కెప్టెన్ ధోనీ ట్రోఫీ తీసుకోలేదు . రవీంద్ర జడేజా (ravindra jadeja), అంబటి రాయుడు కలిసి తీసుకున్నారు . మ్యాచ్ తర్వాత ట్రోఫీ వేడుకకు వేదికపైకి రావాల్సిందిగా అంబటి రాయుడు, రవీంద్ర జడేజాలను ధోనీ గతంలోనే కోరాడని రాయుడు చెప్పాడు. ట్రోఫీ వేడుకకు ముందు ధోనీ నన్ను, జడేజా ని పిలిచాడు. ట్రోఫీ వేడుకలో పాల్గొనాలని కోరారు. మా ఇద్దరితో కలిసి ట్రోఫీ తీసుకోవడమే సరైనదని ధోనీ భావించాడు. నిజానికి ఇదే ధోనీ స్పెషాలిటీ. అలా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ధోనీ అంటే అదే’ అని రాయుడు వెల్లడించాడు.
అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే చెన్నై కప్ గెలవడంలో రాయుడు పాత్ర కూడా కీలకం. ఎందుకంటే అతను కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇది జట్టుకు పెద్ద ఊపునిచ్చింది. ధోనీ తన సహచరుడు మరియు గొప్ప బ్యాట్స్‌మెన్ రాయుడికి ఆ గౌరవాన్ని ఇవ్వాలనుకున్నాడు.
అలాగే, సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (stephen fleming) కూడా రాయుడు ఎంత మంచి ఆటగాడో వివరించాడు. “అంబటి రాయుడు నిజంగా దిగ్గజం. నేను అతనిని బ్యాట్స్‌మెన్‌గా బాగా రేట్ చేస్తున్నాను. మోహిత్ శర్మ (mohit sharma) బౌలింగ్ లో మూడు బంతులను 6, 4, 6గా రాయుడు బాగా ఆడాడు. రాయుడు ఆడకపోవడం లోటే. అందులో ఏ విదమైన సందేహం లేదు’’ అని ఫ్లెమింగ్ తెలిపాడు.
read more news :
IPL 2023 | ఆ చివరి బాల్ అలా వేసి ఉంటే బాగుండేది : గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ