స్యాంట్రో రవి (Santro Ravi) ఇతను చెప్పని మాయ మాటలు లేవు,చేయని తప్పుడు పనులు లేవు. ఇతని జీవిత కథను ఒక పెద్ద సినిమా తీయవచ్చని సినిమా రాజకీయనేతలు అంటున్నారు. ప్రస్తుతం ఇతను కర్ణాటకలో ఒక హాట్ టాపిక్ గా మారాడు. మరి నేరాలకు మారుపేరుగా మారిన ఈ స్యాంట్రో రవి ఎవరు? ఇతను చేసిన నేరాలేంటి? ఇతను ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారాడు? ఇవి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కెఎస్ మంజునాథ్ అలియాస్ స్యాంట్రో రవి మాండ్య జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ అధికారి కొడుకైన ఇతను మండ్యలో ఉన్నప్పుడే హైటెక్ వ్యభిచార వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తరువాత అతని కార్యకలాపాలను మైసూర్‌కు మార్చారు.
మైసూర్, బెంగళూరు, మాండ్య తదితర ప్రాంతాల్లో 1995 నుంచి ఇప్పటి వరకు అతను చేసిన నేరాలకు గాను సుమారుగా 22 కేసులు నమోదయ్యాయి. 2005లో బెంగళూరు పోలీసులకు పట్టుబడిన స్యాంట్రో రవి తరువాత అతని నేరాలు రుజువై జైలుకు వెళ్లాడు.
అయితే జైల్లో కూడా ఇతని పోకడాలకు బ్రేకులు పడలేదు సరికదా స్యాంట్రో రవి అక్కడ ఉండగానే చాలా మంది నేరగాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి,ఉద్యోగం అంటూ ఆశి చూపి ఇతర కోరికలు, ప్రలోభాలకు గురిచేసి ఎందరో అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపాడు.
ఈ నేరాలన్నిటినీ డీల్ చేయడానికి,అతని వ్యాపారాలు నడపడానికి రవి స్యాంట్రో కారునే ఎక్కువగా వాడేవాడు. దీంతో అతను పేరు స్యాంట్రో రవిగా మారింది.
అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ, రకరకాల వ్యాపారాలను నడుపుతున్న స్యాంట్రో రవి మ్యాటర్ మొత్తం బయటకు లాగాలని ప్రస్తుతం కర్ణాటక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
దందాలతో కోట్లాది రూపాయలు
ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేపిస్తానని, ఎవరినైనా బదిలే చేసే సత్తా తనకు ఉందని స్యాంట్రో రవి అందరిని నమ్మిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కర్ణాటకలో బదిలీల వ్యాపారం సాగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా… బెంగళూరులోని కుమారకృప అతిథి ఇంట్లో నెలరోజులుగా ఉంటూ స్యాంట్రో రవి ఇలాంటి వ్యాపారం సాగిస్తున్నాడని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇలాంటి దందాలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడని ఆరోపణలు ఉన్న స్యాంట్రో రవిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే ఇటీవల గుజరాత్‌లో స్యాంట్రీ రవి అరెస్టు అయ్యాడని తెలుస్తుండగా.. హైటెక్ వ్యభిచారం, అధికారుల బదిలీల రాకెట్ల వరకు అన్ని నేరాలలోనూ ప్రమేయం కలిగి ఉన్న స్యాంట్రో రవి నేరాల చిట్టా నెమ్మదిగా పూర్తిగా బయట పడుతుంది.
పెళ్లిళ్లు చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి చాలా మంది అమాయకులైన యువతులను వ్యభిచారంలోకి స్యాంట్రో దింపుతున్నాడని అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెల్లడించారు.
మరి అలాంటి నేరగాడైన స్యాంట్రో రవి నేరాలకు ఇక్కడితోనైనా బ్రేకులు పడతాయా? లేకా ఇంకా కొనసాగుతాయా? ఇవి తేలాలంటే కర్ణాటక ప్రభుత్వం ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలి.
also read:
America news : గ్యాస్ స్టవ్ లతో గండమా? అమెరికాలో వీటి నిషేధం కాయమా?
Anasuya: ఓ వ్యాధితో బాదపడుతున్నట్టు చెప్పి అందరిని ఆశ్చర్యపరచిన అనసూయ