కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ (Superstar) ఎవరనే వివాదం మళ్లీ రాజుకుంది. గతంలో త్యాగరాజన్ భాగవతార్ మొదటి సూపర్ స్టార్ బిరుదు ని పొందారు. ఆ తర్వాత మక్కల్ తిలగం ఎంజీఆర్‌కి అభిమానులు ఆ బిరుదును ఇచ్చారు. తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ లు పోటీకి వచ్చినా మాస్ ఫాలోయింగ్ కారణంగా గత నాలుగు దశాబ్దాలుగా రజనీకాంత్ ఒక్కడే సూపర్ స్టార్. యూనివర్సల్ స్టార్ గా పేరొందిన కమల హాసన్ ఆ జోలికి వెళ్లలేదు.
ఇటీవల విజయ్ మూవీ వరిసు తెలుగు వెర్షన్ వారసుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు విజయ్ ని కోలీవుడ్ సూపర్‌స్టార్ అనడంతో మళ్ళీ వివాదం రాజుకుంది. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ లాంటి వారు కూడా అలాగే అన్నారు. కొద్దిరోజుల తర్వాత గొడవ సద్దుమణిగింది.
ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే , కేరళ రాష్ట్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ బిజినెస్ కంటే నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన లియో సినిమా బిజినెస్ ఎక్కువగా జరగడమే ఇందుకు కారణం. ఇంకో కారణం ఏంటంటే ప్రస్తుతం విజయ్ రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. రజనీకాంత్ కూడా అంతే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే విజయ్ తన 68వ సినిమాకు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ రకంగా చూసినా విజయ్ సూపర్ స్టార్ అని గట్టిగా వాదించే వర్గం ఉంది.
ఇప్పుడు ఈ చర్చలో నటుడు కమల్ హాసన్ పేరు కూడా చేరింది. రీసెంట్ గా కమల్ నటించి, నిర్మించిన చిత్రం విక్రమ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 చిత్రానికి 100 కోట్లు తీసుకుంటున్నారు. ఒకవైపు బిగ్‌బాస్‌లో రియాలిటీ గేమ్‌లలో తీసుకుంటూనే మరోవైపు నిర్మాతగా వరుస చిత్రాలను నిర్మిస్తూ రజనీకాంత్, విజయ్ కంటే అతని వార్షిక ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి కమల్ హాసన్ సూపర్ స్టార్ అని ఆయన అభిమానులు అంటున్నారు.
read more news :