which color to wear on which day : పెద్దవాళ్ళ మాటలు చాదస్తంగా చాలా మంది తీసిపారేస్తూ ఉంటారు. వాళ్ళు కారణాలు చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పినవన్నీ ఆరోగ్యకరమైన సూత్రాలే అని శాస్త్రజ్ఞులు నెమ్మది నెమ్మదిగా కనుక్కొంటున్నారు. అందుకే అనుభవజ్ఞులు ఏది చెప్పినా ఎందుకు? ఏమిటి ? ఎలా ? అని ప్రశ్నించకుండా పాటించెయ్యాలి. మరి టైమ్ టేబుల్ లోకి వెళదామా ?
- సోమ, శుక్రవారాలలో ఆకుపచ్చరంగు ధరించాలి. పచ్చదనం శుభానికి గుర్తు.
- ఆది, మంగళవారాలలో ఎరుపు లేదా మెరూన్ లేదా కాఫీ పొడి దుస్తులు ధరించాలి.
- బుధవారంనాడు తెలుపు, క్రీమ్ కలర్ కట్టుకోవాలి. తెలుపు శాంతికి ప్రతి రూపం !
- గురువారం పసుపురంగు కట్టుకుంటే పసిమిలేని వారు కూడా ఆ చీర కాంతి పడి రవ్వంత రంగుగా, పచ్చగా కనిపిస్తారు.
- శనివారం నలుపు, నీలం కట్టాలి. ఇవి బాగా రంగు ఉన్న వాళ్లకి నప్పుతాయి మరి రంగు తక్కువ వాళ్ళ పరిస్థితి ఏమిటి ? అంటే అంచులలోనైనా, డిజైన్లోనైనా ఆ రంగు ఉండేట్లు చూసుకోవాలి.
అన్ని రకాల రంగు చీరలు లేని వారు ఇది చదివి చీరలు కొనాలని అనుకోవద్దు. ఆపద్ధర్మంగా పైన చెప్పిన సూత్రాలను గుర్తుంచుకోండి.
ఏదో ఒక చీర కట్టుకోవాలి. అది పెద్దవాళ్ళ చెప్పిన రంగు చీర కట్టుకుంటే శుభమని చెప్పటమే తప్ప మరొకటి కాదు.
మరిన్ని వార్తలు చదవండి :
మీ డైనింగ్ రూమ్ ని ఇలా ముస్తాబు చేయండి ..చూస్తే ఆకలి వెయ్యాలి మరి!
మీ బెడ్ రూమ్ ను అందంగా ఇలా అలంకరించుకోండి..
pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా తగ్గించుకోండి..!