Whatsapp: ప్రస్తుతం ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌లోనూ వాట్సప్ ఉంటుంది. మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ అంత పేరు గాంచింది. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్లకు వాట్సప్ సుపరిచితమే. వాట్సాప్ ద్వారా ఎంతో మంది, ఎన్నో పనులను చక్కదిద్దుకుంటూ ఉంటారు.
కార్యాలయం వర్కులు, వ్యక్తిగత సమాచారాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సప్ తీసుకొస్తూనే ఉంది. తాజాగా వాట్సప్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడే సరికొత్త ఆప్షన్ తెచ్చింది.
ఎడిట్ ఫీచర్ ను తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. బంధుమిత్రుల్లో ఎవరికైనా పంపిన సందేశాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో సరిదిద్దుకోవడానికి వాట్సాప్ 15 నిమిషాల విండో అవకాశం ప్రస్తుతం కల్పిస్తోంది.
ఇకపై వినియోగదారులు పంపిన మెసేజ్ లో తప్పులు దొర్లితే పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎడిట్ బటన్ ఆప్షన్ వాడుకుని తప్పును సరిచేసుకొనే వెసులుబాటును వాట్సప్ కల్పించింది.
వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తుంటాం. ఈ సందర్భంంలో కాపీ, ఫార్వర్డ్ లాంటివి కనిపిస్తాయి. ఇకపై వాటితోపాటు ఎడిట్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులను సరిచేసి మళ్లీ సెండ్ చేసుకోవచ్చు.
Read Also : Andhra Pradesh: అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై ఏపీ ప్రభుత్వం ఏమంటోందంటే..