HomedevotionalMaha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?

Telugu Flash News

మహాశివరాత్రి (Maha Shivaratri) అంటేనే హిందువులకు ప్రత్యేకమైన పండుగ. ఫిబ్రవరి 18న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. హిందూధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి ఒకటి. మహాశివరాత్రి రోజు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఉదయాన్నే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు. శివాలయాలను దర్శించుకొని పరమశివుడికి మొక్కులు తీర్చుకుంటారు.

శివరాత్రి రోజు జాగారానికి (Shivaratri jagaram) ప్రత్యేకత ఉంటుంది. పండుగ రోజు చాలా మంది నిర్జల వ్రతాన్ని కూడా ఆచరించడం ఆనవాయితీ. అంటే నీరు కూడా తీసుకోకుండా ఈ వ్రతాన్ని చేస్తారు. మరి కొందరు నీరు మాత్రమే తాగి శివుడిపై భక్తిని చాటుకుంటారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఉపవాసం అంటే.. పండుగ రోజు ఉదయం ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు శివరాత్రి రోజు ఒకేరకంగా ఉంటాయి.

సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తినడం ఆనవాయితీ. కొందరు నీరు లేదా పాలు తాగుతారు. మరి కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు. నీళ్లు కూడా తాగకుండా చాలా మంది భక్తి పారవశ్యంలో లీనమవుతారు. మహా శివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. శివరాత్రి రోజున చేసే ఉపవాసం, రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేయడం వల్ల శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.

భక్తులు పగలు, రాత్రి ఉపవాసం ఉంటారు. రాత్రి సమయంలో భక్తులు శివుని స్తోత్రాలు ఆలపించి పూజలు నిర్వహిస్తుంటారు. శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు. మర్నాడు ప్రజలు పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాసం విడిచి పెడతారు. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండలేని వారు.. ఉడకబెట్టిన ఆలుగడ్డ తీసుకోవచ్చు. హై క్యాలరీల వల్ల ఎక్కువసేపు ఆకలిని దూరం చేస్తుంది. సగ్గు బియ్యంతో అనేక రకాల రెసిపీలు చేసుకొని తినొచ్చు. ఇక పాలతో కూడా పదార్థాలు చేసుకొని తీసుకోవచ్చు. పాలు, పెరుగు, బర్ఫీ, మఖానే ఖీర్‌, పలు రకాల పండ్లు తీసుకోవచ్చు.

also read:

maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..

-Advertisement-

Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News