దీపావళి పండగ సంబరాలు అప్పుడే మొదలు అయిపోయాయి అందులోను దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి (Dhanteras) కి చాలామందికి బంగారం లేదా వెండి కాయిన్లు కొనుక్కునే అలవాటు ఉంటుంది. ఈ ధనత్రయోదశి ఆదివారం (october 23rd 2022) కావడం తో మార్కెట్లు అన్ని కిక్కిరిసి ఉంటాయి., మరునాడు దీపావళి (october 24th 2022), ఇంకా భాయ్‌దూజ్ (october 26th 2022) న వస్తుంది.
అయితే ఈ పండగకు కేవలం బంగారం, వెండి కాయిన్లు మాత్రమే కాదు మనం వాడుకునే వస్తువులు ఏమైనా తీసుకుంటే మంచిది అని పెద్దవారు చెప్తున్నారు. ఐరన్, స్టీల్ వంటివి కాకుండా రాగి, ఇత్తడి, బంగారం, వెండి వస్తువులు ఏమైనా తీసుకోవడం చాలా మంచిది దానికి వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది.
మహారాజు హిముడికి ఒక కుమారుడు అయితే ఆ కుమారుడికి ఒక శాపం ఉండేదట, అతను తనకు పెళ్ళైన నాలుగవ రోజు చనిపోతాడని అక్కడి ఆస్థాన జోతిష్యులు చెప్పారట. అతని పెళ్ళైన నాలుగవ రోజు యమరాజు అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు అతని భార్య ఇంటిని అంతా ఈ వస్తువులతో అలకరించిందట అప్పుడు యమధర్మరాజు ఆ ఇంటి అలంకరణ చూస్తూ మైమరిచి ఆ జంటను వదిలేశారని ఆ కథ సారాంశం.
గోమతి చక్రం కూడా ఇంట్లో ఉంటే సకల సిరి సంపదలు ఇంట్లో ఉంటాయని భావిస్తారు. ఈ చక్రం ద్వారక దగ్గర సముద్రంలోని అరుదైన నత్త నుండి లభిస్తుందని అది ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా మరియు అనందంగా ఉంటారని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు.
ఇటీవలే ఈ పండగ సందర్భంగా వస్తువులు కొనే లిస్ట్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వచ్చి చేరాయి. ఎక్కువగా డిస్కౌంట్లు రావడం వలన అందరు ఎక్కువగా దీపావళి సమయంలో కొత్త వస్తువులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు.
ఇంతే కాకుండా దేవుడి ఫోటోలు కూడా చాలా మంది కొంటున్నారు, ఈ పండగ సందర్భంగా రిటర్న్ గిఫ్టుల కింద వీటిని ఇవ్వడం సంప్రదాయబద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చూడండి :
వయస్సు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..