Telugu Flash News

Amaravati : ఏపీ రాజధానిపై సుప్రీం కోర్టులో కీలక పరిణామం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం ఏమందంటే..!

supreme court

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి (Amaravati) పై ఇంకా పంచాయితీ నడుస్తూనే ఉంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం 161 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అత్యున్నత ధర్మాసనం. ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులిచ్చింది.

రాజధాని విషయంలో తమ పాలసీ ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటు ఉందని, ఆ విధంగానే ముందుకెళ్తామని జగన్‌ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. అయితే, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా చేయాలని అటు ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కూడా డిమాండ్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెబుతున్నారు.

అమరావతిని కదపొద్దంటూ ఆ ప్రాంత రైతులు జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు రెండేళ్లుగా పాదయాత్రలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నా జగన్‌ స్పందించడం లేదు. రైతుల సమస్యలు తనకు చెబితే పరిష్కరిస్తానని చెబుతున్నారు జగన్‌. అయితే, రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. తమకు అమరావతి అభివృద్ధి మాత్రమే కావాలని స్పష్టం చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు రైతులకు అనుగుణంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది.

ఈనెల 31లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలి..

తాజాగా ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసం.. కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులుగా ఉన్న రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 31లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

also read: 

BCCI: బీసీసీఐపై కొన‌సాగుతున్న విమ‌ర్శ‌ల వ‌ర్షం.. ఆ మాత్రం క్లారిటీ లేక‌పోతే ఎలా అని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

దేశంలో పెరుగుతున్న చలి తీవ్రత.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక..

 

 

Exit mobile version