Cracked Heels : చలికాలంలో, వేసవి కాలంలోనూ చర్మ సంరక్షణ కోసం చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మెరిసే చర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్‌లు రాసుకుంటూ ఉంటారు. ముఖంపై అందరూ శ్రద్ధ వహిస్తారు. అయితే, పాదాల సంరక్షణను మాత్రం కొందరు పట్టించుకోరు.
1. నోటి శుభ్రతకు ఉపయోగించే మౌత్‌వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. బకెట్‌లో కొంచెం మౌత్‌వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను పావు గంట పాటు ఉంచాలి. తర్వాత వేరే నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం చూడవచ్చు.
2. యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె పగిలిన పాదాలకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మడిమల పగుళ్లకు కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
3. కొబ్బరి నూనె పొడి చర్మానికి తేమను అందించి ఫ్రెష్‌గా మారుస్తుంది. రోజూ రాత్రిపూట పడుకొనే ముందు పాదాలకు, మడిమలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
also read :