Telugu Flash News

కొత్త పార్లమెంట్ అవసరం ఏంటి ? నితీశ్ విమర్శ

new parliament building

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని రేపు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విపక్షాలు మాత్రం కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 20కి పైగా పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాత పార్లమెంట్ భవనం చారిత్రాత్మకమైనది.. కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి, నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకపోవడంపై ఆయన స్పందిస్తూ.. అక్కడికి వెళ్లడం అర్థరహితమని అన్నారు. నేడు జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి, రేపు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

“అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ దేశ చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తారని నేను పదేపదే చెబుతున్నాను, ప్రస్తుత పార్లమెంటు భారతదేశ చరిత్రలో భాగం, ఈ ప్రభుత్వం అకస్మాత్తుగా కొత్త పార్లమెంటును ఎందుకు నిర్మించాలనుకుంటోంది? ఎందుకంటే ఈ చరిత్రను మార్చాలనుకుంటున్నది, ” అని ఆరోపించారు.

read more news :

Bala Krishna : బాల‌య్య చేతిలో శ్రీలీల త‌న్నులు తిన్న‌దా.. ఇందులో నిజ‌మెంత‌?

Exit mobile version