Telugu Flash News

prostate cancer : ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్స ఇలా..

prostate cancer

prostate cancer

prostate cancer : నేటి కాలంలో చాలా మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం 65 ఏళ్లు పైబడినవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుందని తేలింది. ప్రోస్టేట్ క్యాన్సర్ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ (49.2 శాతం), గాల్ బ్లాడర్ క్యాన్సర్ (45.7 శాతం) పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

1. ప్రోస్టేట్ క్యాన్సర్ బారినపడే ప్రతీ 41 మందిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు.

2. ఈ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో బయటకపోవడం, త్వరగా దీన్ని గుర్తించలేని కారణంగా వ్యాధి తీవ్రత పెరుగుతుంది.

3. ఏటా సెప్టెంబర్‌‌ను ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తుంటారు.

4. ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌నే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి వాల్‌నట్ పరిమాణంలో కటి భాగంలోని బ్లాడర్‌కి పక్కనే ఉంటుంది.

5. ఇది వీర్యపు స్రావాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువే అయినప్పటికీ.. ప్రారంభ దశలో బయటపడే కేసులు చాలా తక్కువ.

6. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశ దాటితే అది ఎముకలు, ఇతర అవయవాలకు విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

7. మూత్ర విసర్జన చేసేటప్పుడు లేదా వీర్య స్కలనం జరిగేటప్పుడు నొప్పి, మంటగా అనిపిస్తుంటే ప్రోస్టేట్‌ లక్షణాలుగా చెప్పొచ్చు.

8. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (PSA) బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.

also read : 

Rashmika : ర‌ష్మిక‌కి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన అభిమాని.. తెగ ఎమోష‌న‌ల్ అయిన నేష‌న‌ల్ క్ర‌ష్‌

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అస‌లేమైంది..!

 

Exit mobile version