బంగాళాదుంపలతో చాలా రకాల వెరైటీలు చేసుకొని రుచికరంగా తింటూ ఉంటాం. అద్భుతమైన టేస్ట్ బంగాళాదుంపల స్పెషాలిటీ. బంగాళాదుంపల్లో మంచి పోషకాలుండటం వల్ల ఇష్టంగా తింటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భారతీయ వంటకాల్లో బంగాళాదుంపలది ప్రత్యేక స్థానం. వీటిలో విటమిన్లతోపాటు ఖనిజాలు, పొటాషియం, మాంగనీస్ కలగలిసి ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
అయితే, మధుమేహంతో బాధపడుతున్న వారు బంగాళాదుంపలు తినొచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. బంగాళాదుంపలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు మంచిది కాదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇతర కూరగాయలు, బంగాళాదుంపలు తీసుకొనే డయాబెటిక్ పేషెంట్లపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సాధారణంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకొనే వారిలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగాళాదుంపలు తీసుకొనే మధుమేహం రోగులకు ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు బంగాళాదుంపల్లాంటి పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బంగాళాదుంపలను ఫ్రై చేయడం కంటే ఉడికించి తినడం మంచిది. ఉడకబెట్టడం వల్ల కార్బో హైడ్రేట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఉడికించిన సందర్భాల్లో పరిమిత స్థాయిలో బంగాళా దుంపలను మధుమేహం బాధితులు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్‌ను తగ్గించడానికి ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాలి. సమతుల ఆహారం అందేలా చూసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
ఆకుకూరలు తీసుకోవడం ముఖ్యం
ఆకు కూరలు రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణ సులభం అవుతుంది. పోషకాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. అన్నింటికంటే ముందు వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. వారి సూచనల ప్రకారం జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చు.
also read news:
IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధికం.. ఏ ఆటగాడికి ఎక్కువ ధర పలికింది అంటే..!