Telugu Flash News

ఏ దేవతలకు ఏ పుష్పాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలి ?

offering flowers to god

ఏ ఏ దేవతలకు ఏ పుష్పాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం ..

వినాయకునికి: 

పుష్పములు : ఎర్రని పుష్పములు ప్రీతి, గరికతో పూజించినా సంకటముల నుండి రక్షించును. తెల్లని అక్షతలతో పూజింపవలెను.

సూచన : వినాయకచవితి నాడు తప్ప, తక్కిన సమయములలో వినాయకుని తులసి దళములతో పూజింపరాదు. దారిద్ర్యము కలుగును.
నైవేద్యం : బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు, కుడుములు ఇష్టము. పండిన మామిడిపండ్లు, అరటి పండ్లు, చెఱకుగడలు సంకటనాశగణేశ స్తుతితో సమర్పించిన సకల శుభములు కలుగును.

శివునికి :

పుష్పములు: ఉమ్మెత్త, అవిశ, జిల్లేడు, ఎర్రగన్నేరు, కర్తవీర మంకెన, జాజి, మల్లె, నాగమల్లి, నందివర్ధన, దూర్వార, మారేడు, తులసి దళములు మంచివి.

సూచన : మొల్ల, జపాకుసుమ, దిరిసెన, బండిగురివింద, మాలతి, మొగలి, సంపెంగ పుష్పములు శివ పూజకు పనికిరావు.

నైవేద్యం : కొబ్బరికాయ, అరటిపండ్లు (చిమ్మిలి నివేదింపవలెను.) అసంతోషుడైన పరమేశ్వరునికి అభిషేకం ప్రీతి, కానీ చెరకురసం, తేనె, ఆవుపాలు, సుగంధ ద్రవ్యాలు వివిధ ఫలాల రసోదకం, రుద్రాక్షోదకాలతో రుద్రాభిషేకం చేసిన అదే మహానైవేద్యంగా స్వామి ప్రీతిచెంది కోరిన కోర్కెలు తీర్చును.

విష్ణుమూర్తికి :

పుష్పములు: అవిసెపూలతో పూజించిన పదివేల యజ్ఞముల ఫలం కలుగును. కదంబ పుష్పములతో పూజించిన స్వర్గము పొందును. తులసి అత్యంత ప్రీతి.

సూచన : దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు కొండగోగు పుష్పములు విష్ణుపూజకు పనికిరావు.

నైవేద్యం : గోధుమ రవ్వతో చేసిన ప్రసాదము, చిత్రాన్నం (పులిహోర), అట్లు ప్రీతి.

వేంకటేశ్వరస్వామికి : వడపప్పు, పానకము నివేదనగావించి తులసిమాల మెడలో ధరింపవలెను.

లక్ష్మీదేవికి : పుష్పములు:తామర పుష్పములతో పూజింపవలెను.

సరస్వతికి : తెల్లని రంగుగల మల్లెలు, జాజి, పారిజాతములు ప్రీతి.
నైవేద్యం : క్షీరాన్నము, మధుర ఫలములు (వడపప్పు, పానకం) గాయత్రీదేవి : పుష్పములు.

లలితాంబకు : ఎరుపుదనం అమిత ప్రీతి, ఎర్రని పుష్పములు,

అమ్మవారికి: ఎర్రని రాళ్ళ కిరీటం, ఎర్రని ఆభరణములు, ఎర్రని వస్త్రములు, ఎర్రని పూమాలలు, పాదముల వద్ద ఎర్రని మందా రములు ప్రీతి.

సూర్యునకు: ఎర్రని పూలతోను, అక్షతలతోను పూజింపవలెను.

ఆంజనేయునకు : తమలపాకులతోను, గంధసింధూరముతోను పూజింపవలెను.

లక్ష్మి, సరస్వతి, లలితాంబికా దేవతలకు పారిజాత పుష్పములు మిక్కిలి ఇష్టం. బంగారు పుష్పములతో పూజ దేవతలందరకు పూజనీయం. శుభము చేకూర్చును.

సూచన : దుర్గాదేవిని గరికతోను, సూర్యుణ్ణి అవిశ పూలతో పూజించిన జన్మజన్మలకు దారిద్ర్యం కలుగును.

నైవేద్యములు :

గౌరీదేవికి : పొంగలి

లలితాదేవికి : క్షీరాన్నం, పులిహోర, గారెలు నివేదింపవలెను. దానిమ్మ గింజలను తేనెతో జోడించి సమర్పించిన అభీష్ట పలసిద్ధి కలుగును.

దుర్గాదేవికి : అల్లముచేర్చిన మినపగారెలు నైవేద్యము పెట్టవలెను.

నాగేంద్రునికి : వడపప్పు, చలిమిడి సమర్పించిన పుట్టలోని నాగన్న చల్లగా చూచును.

చంద్రునికి : చలిమిడి

సూర్యునకు: మొక్క పెసలు, క్షీరాన్నము నైవేద్యము పెట్టవలెను. (పాయసం ప్రీతి)

ఆంజనేయస్వామికి : అప్పాలు, చిట్టి గారెలు ప్రీతి .

Exit mobile version